ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 3 మార్చి 2020 (21:47 IST)

చిరు 'ఆచార్య' మూవీ కోసం మరో డైరెక్టరా..? ఇది నిజమేనా..?

మెగాస్టార్ చిరంజీవి - బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీకి ఆచార్య అనే టైటిల్ కన్ఫర్మ్ చేసారు. ఈ విషయాన్ని ఇటీవల చిరంజీవి ఓ పిట్టకథ ప్రీరిలీజ్ వేడుకలో అనుకోకుండా చెప్పేయడం జరిగింది. 
 
చిరు ఇలా చెప్పారో లేదో.. ఈ టైటిల్‌కి అలా ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి మరో డైరెక్టర్ కూడా వర్క్ చేస్తున్నాడు. అదేంటి కొరటాల శివ డైరెక్టర్ కదా మరో డైరెక్టర్ కూడా వర్క్ చేయడం ఏంటి..? అనుకుంటున్నారా..? ఎంటర్టైన్మెంట్ పార్ట్ రాయడం కోసం రైటర్ టర్నడ్ డైరెక్టర్ అయిన శ్రీధర్ సీపాన హెల్ప్ తీసుకుంటున్నాడట కొరటాల. 
 
ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఓ రేంజ్లో ఉంటుందని.. ఆ విధంగా శ్రీధర్ సీపాన సీన్స్ రాసారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. చిరు సరసన త్రిష నటిస్తుంది. మహేష్‌ సరసన నటించే హీరోయిన్ ఎవరు అనేది ఇంకా ఫైనల్ కాలేదు. త్వరలోనే ఫైనల్ చేయనున్నారు.  ఈ సంచలన చిత్రాన్ని చిరు పుట్టినరోజైన ఆగష్టు 22న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.