శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (11:09 IST)

'ఆచార్య' లాహే లాహే పాటకు 25 మిలియన్ల వ్యూస్

మెగాస్టార్ చిరంజీవి, టాలీవుడ్ చందమామ కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సెన్సేషనల్ డైరెక్టర్ కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న చిత్రం "ఆచార్య"‌. మే 13న చిత్రాన్ని విడుద‌ల చేస్తార‌ని మేక‌ర్స్‌ ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ, కరోనా వ‌లన ఈ మూవీ ఆగ‌స్ట్‌లో విడుద‌ల‌య్యే ఛాన్స్ క‌నిపిస్తుంది. 
 
అయితే 'ఆచార్య' చిత్రాన్ని విభిన్న క‌థాంశంతో మేక‌ర్స్ ప్లాన్ చేయ‌గా, ఈ సినిమాలో పాటలు, డ్యాన్సులు ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ చేశారు. ఇప్పటికే టీమ్ రిలీజ్ చేసిన 'లాహే లాహే' సాంగ్ మంచి హిట్టయింది. పాట‌నే కాదు ఇందులోని చిరు స్టెప్స్ కూడా ప్రేక్ష‌కుల‌ని బాగా ఆక‌ట్టుకున్నాయి.
 
'లాహే లాహే' పాట యూట్యూబ్‌లో సెన్సేషన్స్ సృష్టిస్తుంది. ఇప్పటివరకు 25 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ విష‌యాన్ని చిత్ర బృందం ప్ర‌క‌టించింది. రానున్న రోజుల‌లో సాంగ్ మ‌రిన్ని వ్యూస్ రాబ‌ట్ట‌డం ఖాయంగా తెలుస్తుంది. 
 
కాగా, ఆచార్య చిత్రంలో రామ్ చ‌ర‌ణ్‌, పూజా హెగ్డేలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మ‌ణిశ‌ర్మ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఈయన ఈ చిత్రంలో సిద్ధ అనే పాత్రలో కనిపించనున్నారు. తండ్రీతనయులిద్దరూ నక్సలైట్లుగా కనిపించనున్నారు.