శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 సెప్టెంబరు 2019 (17:21 IST)

ఓ తండ్రికి కుమారుడు ఇచ్చే గొప్ప కానుక ఈ సైరా ... చరణ్ చేతిలో మరో భారీ ప్రాజెక్టు

ఓ తండ్రికి కుమారుడు ఇచ్చే గొప్ప కానుక ఈ "సైరా'" అని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అన్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం 'సైరా నరసింహా రెడ్డి. ఈ చిత్రం అక్టోబరు రెండో తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఐదు భాషల్లో విడుదల కానున్న ఈచిత్రంలో భారీ అంచనాలే నెలకొన్నాయి. తాజాగా ఈ మెగా చిత్రంపై అల్లు అర్జున్ స్పందించారు. 
 
చిరంజీవి కూడా "మగధీర" వంటి భారీ చిత్రంలో నటించాలని భావించానని, ఇప్పటికి ఆ కోరిక తీరిందని వ్యాఖ్యానించారు. పైగా, 'ఓ తండ్రికి కుమారుడు ఇచ్చే గొప్ప కానుక ఈ "సైరా" చిత్రం. నా బావ రామ్ చరణ్‌కు అభినందనలు తెలుపుకుంటున్నాను. మెగాస్టార్ చిరంజీవితో ఇలాంటి గొప్ప చిత్రం నిర్మించాడు. ఈ సినిమా చూసిన తర్వాత దర్శకుడు సురేందర్ రెడ్డిపై గౌరవం రెట్టింపైంది. చిత్ర యూనిట్‌కు నా శుభాకాంక్షలు" అంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. 
 
ఇదిలావుండగా, ఒక వైపున హీరోగా విభిన్నమైన చిత్రాలను చేస్తూనే, మరో వైపున నిర్మాతగా చరణ్ భారీ ప్రాజెక్టులను తెరపైకి తెస్తున్నాడు. ఆయన నిర్మాతగా వ్యవహరించిన 'సైరా' వచ్చేనెల 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ నేపథ్యంలో చరణ్ మరో భారీ ప్రాజెక్టును సొంతం చేసుకున్నట్టుగా ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 
 
మలయాళ అగ్ర హీరో మోహన్ లాల్ కథానాయకుడిగా మలయాళంలో ఈ యేడాది మార్చిలో వచ్చిన చిత్రం 'లూసిఫర్'. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. పైగా, మోహన్ లాల్ స్టార్ ఇమేజ్‌ను మరింతగా పెంచింది. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను చరణ్ దక్కించుకున్నాడట. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై చరణ్ ఈ సినిమాను నిర్మించనున్నాడని చెప్పుకుంటున్నారు. ఈ ప్రాజెక్టును కూడా ఆయన చిరంజీవితోనే చేస్తారనే వార్తలు షికారు చేస్తున్నాయి.