సోమవారం, 25 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : గురువారం, 27 ఆగస్టు 2020 (09:51 IST)

ముదురుతున్న చిరు ఆచార్య - బన్నీ పుష్ప వివాదం..

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి… ఈ రెండు చిత్రాలు వరుసగా బ్లాక్ బస్టర్స్ సాధించడం... ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తుండడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 
 
ఇటీవల చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఆచార్య మోషన్ పోస్టర్ కి అనూహ్యమైన స్పందన లభించింది.
 
ఈ మోషన్ పోస్టర్ ఓ వివాదాన్ని తెచ్చిపెట్టింది. సినిమా రిలీజ్ కాకుండానే.. కేవలం మోషన్ పోస్టర్ చూసి ఇది కాపీ అంటూ ఓ డైరెక్టర్ ఆరోపించడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ మేటర్ ఏంటంటే... డైరెక్టర్ అనిల్ ఈ స్టోరీని తన కథ నుంచి కాపీ కొట్టారంటున్నారు. 
 
గతంలోనే తను ఓ కథ రాసుకుని… రిజిష్టర్ కూడా చేయించడం జరిగింది. ఇప్పుడు ఈ కథతోనే ఆచార్య తీసారని.. మోషన్ పోస్టర్ చూసిన తర్వాత తెలిసింది అన్నారు. దీంతో ఆచార్య కథ కాపీనా..? అనేది వార్తల్లో నిలిచింది. కొరటాల తెరకెక్కించిన శ్రీమంతుడు కథ కూడా కథ విషయంలో వివాదస్పదమైంది.
 
ఇక పుష్ప సినిమా విషయానికి వస్తే… స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తో క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇది ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపధ్యంలో సాగే కథ ఇది. ఈ సినిమా క‌థ నాదే.. అంటూ ఓ ర‌చ‌యిత అంటున్నారు.
Pushpa


ఇంతకీ ఆయన అలాంటి ఇలాంటి రచయిత కాదు. కేంద్ర సాహిత్య యువ పుర‌స్కారాన్ని అందుకున్న ర‌చ‌యిత‌.. వేంప‌ల్లి గంగాధర్‌. 2008లో తాను రాసిన త‌మిళ కూలీ క‌థ‌నే పుష్ష‌ గా తీస్తున్నార‌ని ఆయ‌న ఆరోపిస్తున్నారు. 
 
ఇలా.. ఒకే టైమ్ లో మెగాస్టార్ ఆచార్య, స్టైలీష్ స్టార్ పుష్ప వివాదస్పదం కావడం హాట్ టాపిక్ అయ్యింది. మరి… ఈ వివాదాలపై కొరటాల కానీ, సుకుమార్ కానీ రియాక్ట్ అవుతారో లేదో చూడాలి.