మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 15 మే 2023 (16:37 IST)

కాఫీషాపులో లాంచనంగా ప్రారంభమైన ఛూ మంతర్‌ చిత్రం

Charan Lakkaraju, Yasashree
Charan Lakkaraju, Yasashree
ఛూ మంతర్‌ అంటూ మంత్రగాడు మంత్రం వేసి మాయ చేస్తాడని అందరికి తెలిసిన విషయమే. ఇలా మాయ చేయటానికి  అద్వితీయ మూవీస్‌ పతాకంపై  బి.కల్యాణ్‌ కుమార్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ  వెంకట్‌ కిరణ్‌ కుమార్‌ కాళ్లకూరి నిర్మాతగా చరణ్‌ లక్కరాజు, యశశ్రీ జంటగా నటిస్తోన్న చిత్రం ‘ఛూ మంతర్‌’. సోమవారం ఈ సినిమాని ఫిలింనగర్‌లోని కాఫీషాపులో లాంచనంగా ప్రారంభించింది చిత్రయూనిట్‌. 
 
ముహూర్తపు సన్నివేశానికి  ‘ఎబిసిడి’ చిత్ర దర్శకుడు సంజీవ్‌రెడ్డి క్లాప్‌నివ్వగా నిర్మాత కిరణ్‌ తల్లి శ్రీలక్ష్మీ కెమెరా స్విచాన్, ‘ఉరి ’ చిత్ర దర్శకుడు శ్రీనివాస్‌ తొలిషాట్‌కు దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ–‘‘ తొలిషెడ్యూల్‌ రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ రోజునుండి ప్రారంభౖమైందని గతంలో తన బ్యానర్‌లో ‘గ్రే’ అనే సినిమాను నిర్మించానని ఆ చిత్రం మే 26న విడుదలవ్వనుందని తెలిపారు. అలాగే  ‘హాష్‌టాగ్‌ కృష్ణారామ’’ అనే చిత్రాన్ని నిర్మించాను.  ‘ఛూ మంతర్‌’ చిత్రం ఓ సరికొత్త కాన్సెప్ట్‌తో రాబోతున్న తన బ్యానర్లో నిర్మించనున్న  మూడో సినిమా’’ అన్నారు. 
 
ఈ చిత్రంలో ‘బలగం’ ఫేమ్‌ రూపాలక్ష్మీ, ‘చిత్రం’ శ్రీను యోగి కత్రి, ‘జబర్దస్త్‌’ కుమరం, గడ్డం నవీన్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు– సందీప్, పల్లవి, రవి సంగీతం– సుధా శ్రీనివాస్, లిరిక్స్‌– కాసర్ల శ్యామ్, చాందిని, కెమెరా– మధుసూదన్‌ కోట, ఎడిటర్‌– నాగేశ్వర రెడ్డి, డైలాగ్స్‌– నివాస్, స్క్రీన్‌ప్లే– దావుద్‌ షేక్,  ఆర్ట్‌ డైరెక్టర్‌– హరి వర్మ ప్రొడక్షన్‌– సతీష్‌ , కో–డైరెక్టర్‌ –పూర్ణ, డిజిటల్‌ మార్కెటింగ్‌– విజయ్.