శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 సెప్టెంబరు 2023 (22:39 IST)

యాంకర్ మెడలో రోజా పూల మాల: తమిళ నటుడు కూల్ సురేష్ వెకిలి చేష్టలు

Cool Suresh
Cool Suresh
కోలీవుడ్ ప్రముఖ విలన్ మన్సూర్ అలీఖాన్.. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో 'లియో' చిత్రంలో నటించాడు. ఈ సినిమా అక్టోబర్ నెలలో విడుదల కానుంది. అలాగే మన్సూర్ అలీఖాన్ 'సరకు' చిత్రంలో హీరోగా నటించారు. 
 
జయక్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కథానాయికగా వాలినా ప్రిన్స్ నటించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పాటలను దర్శకుడు, నటుడు సముద్రకని విడుదల చేశారు. ఇందులో పాల్గొన్న కూల్ సురేష్ కాస్త ఓవరాక్షన్ చేశాడు. 
 
యాంకర్ మెడలో వున్నట్టుండి రోజా పువ్వుల మాలను వేసేశాడు. ఈ చర్యతో యాంకర్ నొచ్చుకుంది. ఆపై ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో కూల్ సురేష్ అనే కమెడియన్ క్షమాపణలు చెప్పాడు.