ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 12 ఆగస్టు 2019 (11:05 IST)

#SaraAliKhan పుట్టినరోజు.. కానీ బ్యాంకాంక్‌లో ఏం చేస్తుందంటే?

బాలీవుడ్ స్టార్‌ కిడ్‌, సైఫ్‌ అలీ ఖాన్‌ గారాల పట్టి సారా అలీ ఖాన్‌ చేసే పనిని అంకితభావంతో చేస్తోంది. వరుణ్‌ ధావన్‌ లీడ్‌ రోల్‌లో తెరకెక్కుతున్న కూలీ నెంబర్‌ వన్ రీమేక్‌ షూటింగ్‌ కోసం సారా ప్రస్తుతం బ్యాంకాక్‌లో ఉన్నారు. ఇంకా ఆగస్టు 12వ తేదీ సారా అలీ ఖాన్‌కు పుట్టిన రోజు కావడంతో సినీ యూనిట్ ఆమె పనికి విరామం ఇచ్చేందుకు సన్నద్ధమయ్యారు. 
 
కానీ సారా మాత్రం వారిచ్చిన ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించిందని టాక్ వస్తోంది. త ఏడాది సైతం బర్త్‌డే రోజు ఆమె తన తొలి మూవీ కోసం సన్నద్ధమయ్యేందుకు రోజంతా డ్యాన్స్‌ ప్రాక్టీస్‌లో మునిగిపోయారు. ఇక ఈసారి బ్యాంకాక్‌లో షూటింగ్‌లో ఉండటంతో సెట్‌లోనే బర్త్‌డేను జరుపుకోనున్నారు.

ఇక కేదార్‌నాథ్‌ మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన స్టార్‌ కిడ్‌ సారా అలీ ఖాన్‌ రెండో సినిమా సింబాతో రూ 100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టి క్రేజీ హీరోయిన్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇకపోతే.. తాజాగా సారా నటిస్తున్న కూలీ నెంబర్ వన్ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను సినీ యూనిట్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.