శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 8 డిశెంబరు 2021 (11:52 IST)

విజయ్ సేతుపతిపై క్రిమినల్ కేసు నమోదు: వదల బొమ్మాళీ వదలా...

బెంగళూరు విమానాశ్రయంలో తమిళ నటుడు విజయ్ సేతుపతిపై ఓ వ్యక్తి దాడి చేసినట్లు అప్పట్లో ఓ వీడియో హల్చల్ చేసింది. ఐతే సదరు వ్యక్తి తను విజయ్ పైన దాడి చేయలేదనీ, వారే తనపై దాడి చేసారంటూ విజయ్ గాంధీ అనే వ్యక్తి తాజాగా సైదాపేటలో క్రిమినల్ కేసు పెట్టాడు. వారు చేసిన దాడిలో తన చెవికి తీవ్ర గాయం అయ్యిందనీ, చెవి వినబటం లేదని పేర్కొన్నాడు.

 
తను నవంబర్ 2న మెడికల్ చెకప్ కోసం మైసూరు వెళ్లే క్రమంలో నటుడు విజయ్ సేతుపతి ఎదురుపడితే పలుకరించాననీ, ఆయన చిత్రం సక్సెస్ గురించి అభినందించేకు వెళితే తనతో సేతుపతి అసభ్యంగా మాట్లాడాడంటూ ఫిర్యాదు చేసారు.

 
అంతేకాకుండా తన కులం పేరు ఎత్తి కించపరుస్తూ విజయ్ సేతుపతితో పాటు ఆయన మేనేజర్ ఇద్దరూ తనపై దాడి చేసారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే అతడు రూ. 3 కోట్ల మేర పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.