గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 మే 2021 (12:22 IST)

సోనూసూద్ కన్నీళ్లు పెట్టుకున్నారు.. ఎందుకంటే..?

డాన్స్ దీవానే షో షూట్ కోసం సెట్స్‌ను సందర్శించినప్పుడు నటుడు సోనూసూద్ కన్నీళ్లు పర్యంతం అయ్యారు. ఎందుకంటే తీవ్ర అనారోగ్యంతో ఉన్న భారతి అనే మహిళను చికిత్స కోసం నాగ్పూర్ నుంచి హైదరాబాద్ విమానంలో ఎలా తీసుకువెళ్ళారో సోనుకి చూపించారు. ఆన్‌లైన్‌లో షేర్ చేసిన ప్రోమోలో భారతి కుటుంబ సభ్యులు సోనుకు కృతజ్ఞతలు తెలుపుతూ కనిపించాడు.
 
ఆయన మా కుబుంబానికి ఓ దేవుడు లాంటి వాడని ఉద్వేగానికి లోనయ్యి, చేతులెత్తి మొక్కుతూ దండం పెట్టారు. ఆ పరిస్థితిని చూసిన సోను కన్నీళ్లు పెట్టుకున్నారు. 
 
వంద కోట్ల సినిమాను పంపిణీ చేయడం కంటే ఆసుపత్రి పడకలు, ఆక్సిజన్ సరఫరా, ప్రాణాలను రక్షించే మందులు అందించడం చాలా పెద్ద గిఫ్ట్ గా భావిస్తానన్నారు. కొంతమంది నిరుపేదల ప్రాణాలను కాపాడిన సంతృప్తి ఎన్ని డబ్బులున్నా కూడా రాదు అని సోను అన్నారు.



 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ColorsTV (@colorstv)