అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు ... కొత్త చిత్రాలపై అప్‌డేట్స్ వస్తాయా?
టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ హీరో ప్రభాస్ ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యుత్తమ దశలో ఉన్నారు. ఆయన ఈ నెల 23వ తేదీన తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ప్రభాస్ రాబోయే ప్రాజెక్ట్‌ల నుండి అప్డెట్స్ రానున్నాయి. మరోవైపు, ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అతను నటించిన అరడజనకు పైగా సినిమాలు రీరిలీజ్ చేసేందుకు ఫ్యాన్స్‌తోపాటు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ కోవలో మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, చత్రపతి, ఈశ్వర్, రెబల్, సాలార్ వంటి చిత్రాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో రీరిలీజ్ చేశారు. అక్టోబరు 19, 20 తేదీల్లో సలార్ పార్ట్ 1 హైదరాబాద్‌లో స్పెషల్ షోలు వేయబోతున్నారు. 22న మిస్టర్ పర్ఫెక్ట్‌ని దిల్ రాజు పునఃవిడుదల చేస్తున్నారు. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. బర్త్ డే నాడు ప్రభాస్ డెబ్యూ మూవీ ఈశ్వర్ రీ రిలీజ్ అవుతోంది. గతంలో రీ రిలీజ్ అయిన రెబెల్ చిత్రం 23న మరోసారి రిలీజ్ అవుతోంది. చత్రపతి, మిర్చి సినిమాలతో పాటు సాహో, రాధేశ్యామ్ సినిమాల స్పెషల్ షోలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తొంది.
తెలుగు రాష్ట్రాలలో పాటు కర్నాటక గుజరాత్ జపాన్ వంటి లోకేషన్స్‌లో సినిమాల ప్రదర్శనలకు అభిమానులు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ ఏడాది ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అభిమానులు ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన రాబోయే చిత్రం రాజా సాబ్ టీజర్‌ను విడుదల చేయనున్నారు. 2025 వేసవిలో రాజాసాబ్ విడుదల కానుంది.
అనంతరం ప్రభాస్ హను రాఘవపూడి యొక్క ఫౌజీ సెట్స్‌లో చేరనున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ స్పిరిట్ కూడా లైనులో ఉంది. స్పిరిట్, ఫౌజీతో పూర్తి చేసిన తర్వాత ప్రభాస్ కల్కి 2898 AD సీక్వెల్‌ను ప్రారంభించనున్నాడు. ఈ మూడు సినిమాలకు సంబంధించిన స్పెషల్ బర్త్ డే పోస్టర్లను ప్రభాస్ పుట్టినరోజున విడుదల చేయనున్నారు.