శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 ఆగస్టు 2022 (10:27 IST)

కార్తీక దీపంలో దీప.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్

Karthika Deepam
Karthika Deepam
బుల్లితెర అభిమానులకు శుభవార్త. కార్తీక దీపం సీరియల్ మళ్లీ ప్రసారం కానుంది. ఒక ప్రమాదంలో కార్తీక దీపం సీరియల్‌కి దీప దూరమైనా ఇప్పుడు ఆ సీరియల్‌లో దీప పాత్ర మళ్ళీ మొదలైంది. కార్తీక దీపం సీరియల్ ద్వారా దీపకు తెలుగు రాష్ట్రాల్లో వున్న లక్షలాది అభిమానులు ఆమె కోసం పూజలు చేశారు. దీపకి వున్న ఫ్యాన్ ఫాలోయింగ్ సాధారణమైనది కాదు.
 
తెలుగు రాష్ట్రాల్లో దీప గురించి మాట్లాడుకోని ఇల్లు ఉండదు. ఈ నేపథ్యంలో దీప మళ్లీ కార్తీక దీపం సీరియల్ లోకి తిరిగి రావడం పెద్ద పండగలా అనిపిస్తోంది. ఆమె ఎంట్రీపై ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక  ప్రేక్షకులు తనపై చూపించిన ప్రేమకి కృతజ్ఞతలు చెప్పింది దీప.
 
స్టార్ మా లో సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 7.30 గంటలకు ప్రసారమయ్యే ఈ ధారావాహిక దీప పునరాగమనంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ కాబోతోంది అంటున్నారు ఆ సీరియల్ అభిమానులు.