శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 24 జనవరి 2024 (14:13 IST)

షూటింగు దశలో "దేవర" - వరుస అప్‌డేట్స్‌తో పెరుగుతున్న అంచనాలు

Devara look
జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న కొత్త చిత్రం "దేవర". హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ చకచకా సాగిపోతుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చుతున్నారు. ఈ చిత్రం ద్వారా దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్‌గా తెలుగు వెండితెరకు పరిచయమవుతున్నారు. వేసవి సందర్భంగా ఏప్రిల్ ఐదో తేదీన విడుదల చేయనున్నారు. 
 
అయితే, ఈ చిత్రం ముందుగా ప్రకటించిన విడుదల తేదీ నాటికి విడుదలయ్యే అవకాశాలు లేవనే టాక్ వినిపిస్తుంది. ఇంకా కీలకమైన భారీ సన్నివేశాల చిత్రీకరణ మిగిలే ఉండటం వల్ల పాటలను కూడా చిత్రీకరించాల్సి ఉండటంతో ఈ  సినిమా విడుదలలో మరికొంత జాప్యం నెలకొనే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల సమాచారం. 
 
దీంతో ఈ సినిమాను జూన్ నెల లేదా ఆగస్టు 15వ తేదీన విడుదల చేయాలన్న ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు సమాచారం. అయితే, ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి. సముద్రతీర ప్రాంతంలో నడిచే ఈ కథలో సైఫ్ అలీఖాన్, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్‌లు ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు.