సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 26 జనవరి 2019 (12:25 IST)

ధనుష్ అసురన్ నుంచి ఫస్ట్ లుక్.. వైరల్

కొలవెరి హీరో ధనుష్ కథానాయకుడిగా తమిళంలో అసురన్ సినిమా నిర్మితమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ధనుష్ ఫస్ట్ లుక్ రిలీజైంది. వెట్రిమారన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేసిన ఈ ఫస్టులుక్ పోస్టర్‌లో ధనుష్ లుక్ వెరైటీగా వుంది.
 
బ్లాక్ కలర్ బనీన్‌తో గళ్ల లుంగీతో బల్లెంతో దాడికి దిగుతున్నట్లు గల ఈ పోస్టర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటికే మారి-2తో హిట్ కొట్టిన ధనుష్.. ప్రస్తుతం అసురన్‌తోనూ హిట్ కొట్టక మానడని సినీ జనం అప్పుడే జోస్యం చెప్తున్నారు. కాగా ధనుష్ సరసన అసురన్‌లో మంజు వారియర్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.