ధోనీతో ఉండాలని ఉందికానీ... పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదు : లక్ష్మీరాయ్

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్‌తో గడపాలనే కోరిక బలంగా ఉండేదనీ కానీ పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం మాత్రం తనకు లేదనీ ఐటం గర్ల్ లక్ష్మీరాయ్ అన్నారు. 2008లో ధోనీతో లక్ష్మీరాయ్‌ డేటింగ్‌ చేసినట్ట

pnr| Last Updated: మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (11:59 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్‌తో గడపాలనే కోరిక బలంగా ఉండేదనీ కానీ పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం మాత్రం తనకు లేదనీ ఐటం గర్ల్ లక్ష్మీరాయ్ అన్నారు. 2008లో ధోనీతో లక్ష్మీరాయ్‌ డేటింగ్‌ చేసినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీని గురించి తాజాగా లక్ష్మీరాయ్‌ స్పందించింది.

'2008 ఐపీఎల్‌ సీజన్‌లో ఓ యేడాది పాటు నేను చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టుకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్నా. ఆ సమయంలోనే ధోనీతో పరిచయం ఏర్పడింది. అతనితో సన్నిహితంగా ఉన్న మాట నిజమే కానీ, పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన మాకు రాలేదు. ఆ సీజన్‌ ముగిశాక సీఎస్‌కేతో నా అనుబంధం ముగిసింది. ఆ తర్వాత ధోనీ కూడా నాకు టచ్‌లో లేడు. ఎనిమిదేళ్లు ముగిసిన తర్వాత కూడా ధోనీతో నా ఎఫైర్‌ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారో అర్థం కావడం లేద’ని లక్ష్మీరాయ్‌ తెలిపింది.దీనిపై మరింత చదవండి :