గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 27 సెప్టెంబరు 2024 (18:01 IST)

ఆర్.ఆర్.ఆర్ సెట్‌లో నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అసలైన చిరుతలతో పని చేశారా?

Jr NTR
కపిల్ బృందం ఇప్పటికే తమ మొదటి ఎపిసోడ్‌తో మన హృదయాలను, జిగ్రాను గెలుచుకున్నారు. రాబోయే ఎపిసోడ్‌లతో మన  శనివారాలను ఫన్నీవార్‌లుగా మార్చే లక్ష్యంతో వారు కొనసాగుతున్నారు. ఈసారి నెట్‌ఫ్లిక్స్ యొక్క ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో, మేము ‘దేవర’ యొక్క ముఖ్య తారాగణం - జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్‌తో కలిసి రాబోతున్నాము. లెజెండరీ మ్యాన్ ఆఫ్ ది మాసెస్, జూనియర్ ఎన్టీఆర్ ఈ బృందంలో ఉండటంతో, మెగాహిట్ ఆర్.ఆర్.ఆర్‌లో పనిచేసిన అనుభవంపై ప్రశ్నలు ఎన్నో సహజంగానే తలెత్తుతాయి. సినిమాలో వివిధ రకాల జంతువులతో పాటుగా తన ఉద్విగ్నభరితమైన ప్రవేశ సన్నివేశాన్ని చిత్రీకరించడం ఎలా ఉందని కపిల్ అడిగినప్పుడు, జూనియర్ ఎన్టీఆర్ ఇదే సన్నివేశం గురించి, తన అభిమానులలో వున్న ఈ హాస్యాస్పదమైన సందేహాలను గురించి చెబుతూ ఎంతోమంది ఈ ప్రశ్నను తనను అడిగారన్నారు. 
 
కపిల్‌తో మాట్లాడిన జూనియర్ ఎన్టీఆర్ ఆ విశేషాలను పంచుకుంటూ, “లోగ్ సోచ్ రహే థి, కి వో జో భీమ్ కా ఎంట్రీ థా నా( ప్రజలు అనుకుంటారు, భీమ్ ఎంట్రీ సమయంలో), ఆ చిరుతలు, ఎలుగులు మరియు సింహాలు నిజమే అని. ప్రజలు నిజానికి ఆలోచిస్తున్నారు, కి మే యాక్చువల్లీ అందర్ యానిమల్స్ కే సాథ్ బైథా హువా థా. లోగ్ ముఝే పుచ్ రహే ది కి, కైసే బైత్ గయే ఆప్? ఫిర్ మైనే బోలా యార్, యే తో పురా విఎఫ్ఎక్స్ హైన్. ఔర్ వో బోలే, ‘అర్రే నహీ, యే విఎఫ్‌ఎక్స్ నహీ హైం సర్, యే ఆప్ సచీ మెయిన్ బైత్ గయే హైం!’ తో ముఝే లోగో కో ఎక్స్ప్లెయిన్ కర్నే కే లియే, పూరీ ఆర్.ఆర్.ఆర్ కి సినిమా సునానీ పడి(నవ్వుతూ)” ( నిజానికి నేను, జంతువులతో పాటు కూర్చుని వున్నానని? అనుకుంటుంటారు. జనాలు నన్ను అడుగుతుంటారు, మీరు ఎలా కూర్చున్నారని ? అప్పుడు నేను, యార్, అది అంతా విఎఫ్ఎక్స్ మహిమ అని చెప్పేవాడిని. అయినా సరే, వారనే వాళ్ళు , అది విఎఫ్ఎక్స్ కాదు సర్, మీరు అక్కడ నిజంగానే కూర్చున్నారు అని అంటుండేవారు. వీళ్ళందరికీ నేను ఎక్ష్ప్లైన్ చేయాలంటే, మొత్తం ఆర్.ఆర్.ఆర్ టీంను తీసుకువెళ్ళాలి ( నవ్వుతూ) ) 
 
ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్క్రీన్‌పై ఉక్కు మనిషిగా అద్భుతంగా నటించవచ్చు, కానీ నిజ జీవితంలో పులులు, చిరుతలతో కలవడం అతనికి కూడా చాలా కష్టం కావచ్చు. ఈ ఫన్నీవార్‌లో ఇలాంటి మరిన్ని కథనాలను వినడానికి, ఈ శనివారం రాత్రి 8 గంటలకు, నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రమే ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో ట్యూన్ చేయడం మర్చిపోకండి.