శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (14:11 IST)

ప్రభుదేవా మెగాఫోన్‌కు గుడ్ బై చెప్పేసినట్లేనా?

ప్రభుదేవా మెగాఫోన్‌కు గుడ్ బై చెప్పేసినట్లేనా. చిరంజీవితో శంకర్ దాదా, అక్షయ్ కుమార్‌తో రౌడీ రాథోడ్ చేసిన ప్రభుదేవా సల్మాన్‌తో రెండు సినిమాలు చేశాడు. డైరెక్టర్‌గా వరుస ఫ్లాప్‌లు తీసుకున్న ప్రభుదేవా మెగాఫోన్ జోలికి వెళ్ళకుండా యాక్టింగ్ పైన దృష్టి పెడుతున్నాడట.

 
టాప్ కొరియోగ్రాఫర్ ఉన్న టైంలో... అంటే 2017 సంవత్సరంలో నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీతో దర్సకుడిగా పరిచయమయ్యాడు ప్రభుదేవా. ఇప్పటివరకు 17 సినిమాలను డైరెక్ట్ చేస్తే అందులో కేవలం నాలుగే నాలుగు హిట్టయ్యాయట. 

 
దర్సకుడిగా ప్రభుదేవా సక్సెస్ రేటు చాలా తక్కువగా ఉందట. ప్రభుదేవా సక్సెస్ చూసి చాలా రోజులవుతోంది. తెలుగులో హిట్ అయిన విక్రమార్కుడిని హిందీలో రౌడీ రాథోడ్‌గా చిత్రీకరిస్తే సూపర్ హిట్ అయ్యింది. ఆ తరువాత నువ్వొస్తావంటే నేనొద్దంటానా అనే సినిమాను హిందీలో రామయ్యా వస్తావయ్యా పేరుతో రీమేక్ చేస్తే డిజాస్టర్ అయ్యింది. తెలుగు మూవీతో దర్సకుడిగా మారిన ప్రభుదేవా ఆ తరువాత ప్రభాస్‌తో పౌర్ణమి, చిరంజీవితో తీసిన శంకర్ దాదా జిందాబాద్ సినిమాలు నిరాశపర్చడంతో తెలుగులో మరో ఆఫర్ దక్కలేదు.

 
తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దానంటానా, తమిళ పోకిరి హిట్ కొట్టాడు. రాజ్ కుమార్ యాక్షన్ సినిమా, దబాంగ్-3, రాధే  అన్ని సినిమాలు ఫ్లాప్ కావడంతో డైరెక్షన్ మీద ప్రభుదేవాకు ఆసక్తి తగ్గిందట. వరుస ఫ్లాప్‌లతో నిరాశపడ్డ ప్రభుదేవా ఇక మెగా ఫోన్ జోలికి వెళ్ళకూడదనుకుంటున్నారట. డైరెక్షన్ మానేసి యాక్టింగ్ చేసుకుంటే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నాడట. వీలైతే కొరియోగ్రాఫర్‌గా కొనసాగాతానంటున్నాడు ప్రభుదేవా.