మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (11:53 IST)

ఇకపై దర్శకత్వం చేయనంటే చేయను : ప్రభుదేవా

ఇకపై సినిమాలకు దర్శకత్వం చేసే ప్రసక్తే లేదని ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా స్పష్టం చేశారు. ఈయన నృత్యదర్శకుడిగానే కాకుండా నటుడుగా, దర్శకుడుగా ఎంతగానో ఆలరించారు. ఇండియ‌న్ మైకేల్ జాన్స‌న్‌గా పేరొందిన ఆయ‌న తెలుగులో ఎమ్మెస్ రాజు బ్యానరులో రెండు సినిమాలు చేశారు. ఇక ఇక్క‌డి సినిమాల‌ను హిందీలో రీమేక్ చేసి మంచి విజ‌యం అందుకున్నారు.
 
కొన్నాళ్లుగా ప్ర‌భుదేవాకి పెద్ద‌గా స‌క్సెస్‌లు రావ‌డం లేదు. సల్మాన్ ఖాన్‌తో చివరగా చేసిన "రాధే" సినిమా అభిమానులను దారుణంగా నిరాశపరిచింది. దాంతో ప్రభుదేవా తిరిగి చెన్నైకు చేరుకున్నారు. 
 
ఇకపై డైరెక్షన్ చేయకూడదని నిర్ణయించుకున్న ఆయన.. నటన పైనే పూర్తి దృష్టి పెట్టాడని చెబుతున్నారు. నటుడిగా వరుస అవకాశాలు వస్తున్న కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన 'భగీరా' అనే సినిమా చేస్తున్నారు.