1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 30 సెప్టెంబరు 2021 (13:38 IST)

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి దిల్ రాజు భారీ షాక్, సన్నాసి అంటుంటే పక్కనే కూర్చుని...

నేనేం బూతు మాట అన్నాను. ఆ సన్నాసి నన్ను అంటే సన్నాసిన్నర అన్నాను. ఆ సన్నాసి అన్నది కరెక్ట్ అయితే నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది, బూతు వుంటే మీరు బీప్ వేస్తారుగా, వేయలేదే... ఇదంతా మంత్రి పేర్ని నాని నిన్న మీడియా ముందు మాట్లాడిన విషయం. ఐతే పక్కనే వున్న నిర్మాత దిల్ రాజు మాత్రం ఇదంతా వింటూ వున్నారు. ఆ తర్వాత కూడా పవన్ కళ్యాణ్‌కి షాకిచ్చే కామెంట్లు చేసారు.
 
ఏపీ స‌మాచార మంత్రి పేర్నినానితో స‌మావేశం అయిన త‌ర్వాత నిర్మాత దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. గ‌త సంవత్సరం చిరంజీవి గారితో ప్రముఖులంతా సీఎం జ‌గ‌న్‌ని కలిశార‌ని, ఆ త‌ర్వాత కోవిడ్ వ‌ల్ల కొంత గ్యాప్ వచ్చింద‌ని చెప్పారు. వకీల్ సాబ్ సినిమా విడుదల సందర్భంగా కొంత ఇబ్బందికర వాతావరణం నెలకొంద‌ని, సినిమా అనేది చాలా సున్నితమైనద‌ని ఆయ‌న ఆయ‌న వివ‌రించారు.
 
ఎలాంటి దుష్ప్రభావమైనా ముందు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లపై ఆ ప్రభావం పడుతుంద‌ని, ఇపుడు రెండు తెలుగు ప్రభుత్వాలు సానుకూల వాతావరణంలోనే ఉంద‌ని చెప్పారు. ఆన్‌లైన్ టిక్కెటింగ్, ఆక్విపెన్సీ గురించి చర్చించామ‌ని తెలిపారు. మా సినిమాను వివాదం చేయవద్ద‌ని, రాజకీయం వల్ల మా సినిమాకు ఎటువంటి నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, మీడియాపై ఉంద‌ని అన్నారు. ఎవరో ఏదో మాట్లాడిన దానికి ఇండస్ట్రీకి సంబంధం లేద‌ని, ప‌రోక్షంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కామెంట్స్ పైన కౌంట‌ర్ ఇచ్చారు.