శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 22 ఫిబ్రవరి 2024 (17:11 IST)

మ్యూజిక్ డైరెక్టర్ రధన్ వల్ల మోసపోయానన్న దర్శకుడు

Director yashaswi, Siddharth Roy
Director yashaswi, Siddharth Roy
సినిమా తీయడానికి వచ్చే కొత్త దర్శకులను కొందరు మోసం చేస్తుంటారు. దానితో అనుకున్న టైంకు సినిమా విడుదలకాకుండా పోతుంది. దానితో పెట్టిన పెట్టుబడి కూడా రెట్టింపు అవుతుంది. సిద్దార్థ్ రాయ్ సినిమా దర్శకుడు యశస్వి తనకు జరిగిన అనుభవాలను చెప్పుకొచ్చాడు. నేడు ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్ లో జరిగింది. తాను ఎన్నో కష్టాలు పడ్డాను, కొందరివల్ల మోసపోయాననీ డైరెక్ట్ గా మ్యూజిక్ డైరెక్టర్ రథన్ పై విరుచుపడ్డారు. 
 
Siddharth Roy  prerelease
Siddharth Roy prerelease
రథన్ వల్లే సినిమా ఆలస్యమైంది. అన్నింటికీ అనవసరమైన ఆర్గ్యుమెంట్ చేస్తాడు. చెన్నైలో ఉంటాడు కాబట్టి సరిపోయింది. హైదరాబాద్​లో ఉంటే చాలా గొడవలు జరిగేవి.  తనలా ఎవరూ మోసపోకూడదన్నారు యశస్వి. ఆయనలో అంత టాలెంట్ ఉన్నా, గొప్ప టెక్నీషియన్ అయినా ఇంతగా వేధించడం కరెక్ట్ కాదని ఫైర్ అయ్యారు. ఒకసారి ఆర్గుమెంట్స్ చేస్తూ రాజమండ్రి నుంచి వైజాగ్ దాకా కారులో వెళ్లిపోయానని.. అంతగా ఇబ్బంది పెట్టాడని  యశశ్వి ఆవేదన వ్యక్తం చేశాడు. రథన్ ఇంతకుముందు అర్జున్ రెడ్డి సినిమాకు పనిచేశాడు. సిద్దార్థ్ రాయ్ కూడా అఠువంటి కథగా ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది. కానీ సినిమా కథ వేరుగా వుంటుందని యశశ్వి తెలియజేస్తున్నారు. రేపు ఈ సినిమా విడుదలకాబోతుంది.