బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 1 ఆగస్టు 2017 (02:15 IST)

ఈ స్పైడర్ ప్రయోగాలు, స్టంట్‌లు మహేష్ కొంప ముంచుతాయా లేపుతాయా.. కథ ఉందా అసలు?

స్పైడర్ సినిమా షూటింగులో మహేష్ బాబు ఫైటింగ్ సీన్లను, యాక్షన్ సీన్లను అద్భుతంగా పండిస్తున్నట్లు వార్తలు పేలుతున్నాయి. ‘సినిమాలో ఈ సీన్‌ ఎంతసేపు ఉంటుదన్నది కాదన్నయ్యా... ప్రేక్షకులకు థ్రిల్‌ ఇస్తుందా లేదా అన్నదే ఇంపార్టెంట్‌’ అన్నట్టు మహేశ్‌బాబు ‘స్పైడ

స్పైడర్ సినిమా షూటింగులో మహేష్ బాబు ఫైటింగ్ సీన్లను, యాక్షన్ సీన్లను అద్భుతంగా పండిస్తున్నట్లు వార్తలు పేలుతున్నాయి. ‘సినిమాలో ఈ సీన్‌ ఎంతసేపు ఉంటుదన్నది కాదన్నయ్యా... ప్రేక్షకులకు థ్రిల్‌ ఇస్తుందా లేదా అన్నదే ఇంపార్టెంట్‌’ అన్నట్టు మహేశ్‌బాబు ‘స్పైడర్‌’ షూటింగ్‌ చేశారట. ఉదాహరణకు ఇందులో మహేశ్, విలన్‌గా చేస్తున్న తమిళ హీరో భరత్‌ మధ్య ఓ స్టంట్‌ సీక్వెన్స్‌ను వియత్నాంలో తీశారు. 
 
ఈ ఒక్క స్టంట్‌ను పదిహేను రోజులు చిత్రీకరించారు. అదీ రన్నింగ్‌లో ఉన్న రోలర్‌ కోస్టర్‌ మీద! రోలర్‌ కోస్టర్‌పై రైడింగే కష్టమంటే ఫైటింగ్‌ ఇంకెలా ఉంటుందో ఊహించుకోవాల్సిందే. చాలా కష్టం కదూ! అయినా, మహేశ్‌ చాలా ఈజీగా, కూల్‌గా కంప్లీట్‌ చేశారని చిత్రబృందం పేర్కొంది. పీటర్‌ హెయిన్‌ యాక్షన్‌ కొరియోగ్రఫీ చేసిన ఈ స్టంట్‌ క్లైమాక్స్‌లో వస్తుందట. ఇటువంటి సీన్లతో ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌ చేసేలా యాక్షన్‌ అండ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ ‘స్పైడర్‌’ను తీర్చిదిద్దారట. 
 
‘ఠాగూర్‌’ మధు సమర్పణలో ఎన్వీ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో చివరి పాటను నేటి నుంచి యూరప్‌లో చిత్రీకరించనున్నారు. మరోపక్క ప్రచార కార్యక్రమాలను మహేశ్‌ ముమ్మరం చేశారు. సినిమాలో ఒక్కో పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రేపు ‘బూమ్‌ బూమ్‌’ పాటను విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు హ్యారీస్‌ జయరాజ్‌ స్వరకర్త.
 
ఈ స్పైడర్ ప్రయోగాలు, స్టంట్‌లు మహేష్ కొంప ముంచుతాయా లేపుతాయా.. అనే సందేహాలు కూడా కొంతమందిలో పుట్టుకొస్తున్నాయి. కథకు ప్రాధాన్యం లేకుండా స్టంట్లకు, పాటలకు  కోట్లు పెడితే కాసుల పంట పండిపోతుందనేది  పాత కథ. అందుకే స్పైడర్‌లో కథ ఉందా అసలు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.