గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 జులై 2023 (22:19 IST)

చిత్రపురి కాలనీలో నటుడు ప్రభాకర్ రెడ్డి విగ్రహం ఏర్పాటు (Video)

Dr. M. Prabhakar Reddy
Dr. M. Prabhakar Reddy
దివంగత నటుడు డాక్టర్ ఎమ్.ప్రభాకర్ రెడ్డి విగ్రహాన్ని చిత్రపూరి కాలనీలో ఏర్పాటు శనివారం ఆవిష్కరించారు. ఆయన కుమార్తెలు, బంధువులు MIG చిత్రపూరి కాలనీలో డాక్టర్ ఎమ్.ప్రభాకర్ రెడ్డి విగ్రహాన్ని శనివారం ఆరంభించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్‌కి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి కుటుంబీకులు మాట్లాడుతూ.. ప్రభాకర్ రెడ్డి గారు చిత్రసీమకు చేసిన సేవల గురించి గుర్తు చేశారు. ఆయన కుటుంబం కోసం కాకుండా నలుగురు బాగుండాలని ఆకాంక్షించేవారని.. సినీ కార్మికుల సంక్షేమం కోసం పనిచేశారని చెప్పారు. 
 
కాగా.. తెలుగు సినిమా పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు తరలి వచ్చిన సమయంలో సినీకార్మికుల పక్షాన నిలిచారు. ఆయన కృషి ఫలితంగానే హైదరాబాద్‌లో నేడు సినీకార్మికుల గృహవసతి లభించింది. అందుకే ఆ గృహసముదాయానికి డాక్టర్ ఎమ్.ప్రభాకర్ రెడ్డి చలనచిత్ర కార్మిక చిత్రపురి అని నామకరణం చేశారు. ఇప్పుడాయన విగ్రహాన్ని ఆ కాలనీలో ఏర్పాటు చేశారు.