శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 సెప్టెంబరు 2021 (16:54 IST)

రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ ముందుకు హాజరు కావాల్సిందే...

తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ కేసులో ప్రముఖ నటి, నిర్మాత ఛార్మిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మనీ లాండరింగ్‌ కోణంలో ఆమె బ్యాంక్‌ ఖాతాలు పరిశీలిస్తూ.. ఆమె వ్యక్తిగత, ప్రొడెక్షన్‌ హౌస్‌ లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారని తెలుస్తోంది. 
 
 ఈ నెల 6న ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సిన సినీ నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. కొంత గడువు కావాలని కోరారు. వరుస షూటింగ్‌లతో బిజీగా ఉండటం వల్ల.. తాను ఇప్పుడే విచారణకు హాజరు కాలేనని.. కొంత సమయం ఇవ్వాలని ఈడీ అధికారులకు లేఖ రాశారు. 
 
అయితే రకుల్ రిక్వెస్ట్‌ను ఈడీ అధికారులు రిజెక్ట్ చేశారఐ సమాచారం. ముందుగా నోటీసులు ఇచ్చిన ప్రకారం ఈ నెల 6న విచారణకు హాజరు కావాల్సిందేనని ఈడీ స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది.