గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 7 ఫిబ్రవరి 2024 (10:29 IST)

11 యేళ్ల వైవాహిక బంధానికి ముంగింపు పలికిన ఈషా డియోల్

esha deol - bharat
బాలీవుడ్ చిత్రపరిశ్రమకు చెందిన మరో హీరోయిన్ తన వైవాహిక బంధానికి తెరదించారు. తన భర్తతో ఉన్న 11 యేళ్ల వివాహబంధానికి ముగింపు పలికారు. ఆమె ఎవరో కాదు.. ప్రముఖ సీనియర్ నటి హేమమాలిని కుమార్తె ఈషా డియోల్. ఈమె తన భర్త భర్త తఖ్తానీతో ఉన్న వివాహ బంధాన్ని తెంచుకున్నారు. భర్తతో కలిసి సంయుక్త ప్రకటన చేశారు. పరస్పర అంగీకారంతో, స్నేహపూర్వకంగా విడిపోతున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం తమ బిడ్డల భవిష్యత్తే ముఖ్యమని ప్రకటించారు. అందువల్ల ఈ క్లిష్ట సమయంలో తమ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దని ఆమె మీడియాకు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు. 
 
కాగా, హేమమాలిని - ధర్మేంద్ర కుమార్తెగా గత 2002లో "కోయి మేర్ దిల్ సే పూఛే" చిత్రంతో సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఈషా డియోల్... ఆ తర్వాత పలు హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఆ తర్వాత నటనకు దూరమయ్యారు. 2012లో భరత్ తఖ్తానీ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు. వీరికి మిరాయా, రాధ్యా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వివాహం, పిల్లలు కారణంగా కొంతకాలం పాటు నటనకు బ్రేక్ తీసుకున్న ఈషా డియోల్.. కేక్ వాక్ అనే ష్టార్ ఫిల్మ్ ద్వారా మళ్లీ తెరంగేట్రం చేశారు. ఈ నేపథ్యంలో ఇపుడు తన వివాహ బంధానికి ముంగిపు పలుకుతున్నట్టు వారు ప్రకటించారు.