శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By కుమార్
Last Updated : గురువారం, 31 జనవరి 2019 (14:16 IST)

అంతేగా అంటూనే.. రూ.100 కోట్ల వైపు ఎఫ్2 పరుగులు... హిందీలోకి రీమేక్..

సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలతో పోటీ పడి మరీ అద్భుత విజయాన్ని సాధించిన సినిమా "ఎఫ్2" ఇప్పుడు రూ.వంద కోట్లకు క్లబ్‌కు చేరువకు పరుగులు తీస్తోంది. ఒకవైపు కలెక్షన్ల హవా కొనసాగుతుండగా మరోవైపు ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేసేందుకు చకచకా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత దిల్ రాజు వెల్లడించారు. 
 
ఈ సినిమాను తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు. ఈ సినిమాను తానే హిందీలో నిర్మించే అవకాశాలు ఉన్నాయని, కాకుంటే తెలుగులో ఈ ఏడాది చేయాల్సిన సినిమాలు చాలానే ఉన్నందున నిర్మాణ భాగస్వామిగా ఉండటమే శ్రేయస్కరం అనే ఆలోచనలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ముంబైలో ఈ సినిమా రీమేక్‌కు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని, ఎవరెవరు నటిస్తున్నారనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.