శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 జూన్ 2022 (10:34 IST)

నొప్పి లేకుండా ప్రాణాలు వదలడం ఎలా? నెట్‌లో సెర్చ్ చేసిన ప్రత్యూష

Prathyusha Garimella
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల (36) ఆత్మహత్య ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పలు విషయాలు వెలుగులో వచ్చాయి. నొప్పి లేకుండా ప్రాణాలు వదలడం ఎలా అని ఇంటర్నెట్‌లో ప్రత్యూష సెర్చ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. 
 
కొద్ది వారాల పాటు దీనిపై ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసిన ప్రత్యూష.. చివరకు కార్బన్ మోనాక్సైడ్ పీల్చడం ద్వారా ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్ధారించారు. గాలి బయటకు వెళ్లని వాష్‌రూమ్‌లో చార్‌కోల్‌ను మండించడం ద్వారా విడుదలైన కార్బన్ మోనాక్సైడ్‌ను పీల్చడం వల్లే ప్రత్యూష చనిపోయినట్లు తేల్చారు. 
 
ఆత్మహత్యకు 10 రోజుల ముందు ప్రత్యూష తన బొటిక్‌కి ఒక కార్పెంటర్‌ను పిలిపించారు. అతనితో వాష్‌రూమ్‌లోని కిటికీ, వెంటిలేటర్‌ను తొలగించారు. కిటికీ, వెంటిలేటర్ ఉన్న ప్రాంతాన్ని పూర్తిగా క్లోజ్ చేశారు. దీంతో వాష్‌రూమ్‌ పూర్తిగా ఎయిర్ టైట్‌గా మారిపోయింది. 
 
ఇదే వాష్ రూమ్‌లో ప్రత్యూష కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఆత్మహత్యకు పాల్పడింది. ముందస్తు ప్లాన్‌తోనే ప్రత్యూష వాష్‌రూమ్ కిటికీ, వెంటిలేటర్ మూసివేయించిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
ప్రత్యూష నిర్వహిస్తున్న బొటిక్‌లో చార్‌కోల్ ఇదివరకే ఉందా.. లేక ఆత్మహత్య కోసమే ఆమె దాన్ని కొనుగోలు చేసిందా అన్నది తెలియాల్సి ఉంది.