బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 10 నవంబరు 2021 (10:59 IST)

దాక్షాయణి అదిరింది... పుష్ప నుంచి మరో పోస్టర్ రిలీజ్

పుష్ప చిత్రం నుంచి మరో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. బుల్లితెర యాంకర్ అనసూయ ఈ చిత్రంలో దాక్షాయణి పాత్రను పోషిస్తున్నారు. ఈ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను చిత్ర బృందం బుధవారం రిలీజ్ చేశారు. 
 
ఇందులో ఆమె పాత్ర చాలా నెగెటివిటీతో ఉంటుంద‌ని తెలుస్తుంది. 'రంగస్థలం' చిత్రంలో రంగ‌మ్మ‌త్త పాత్ర‌కు పూర్తి భిన్నంగా దాక్షాయ‌ణి పాత్ర‌ని సుకుమార్ డిసైడ్ చేశాడ‌ని అంటున్నారు. తాజాగా దాక్షాయ‌ణి పాత్ర‌కు సంబంధించి లుక్ విడుద‌ల చేయ‌గా, ఈ లుక్ చూసి ప్ర‌తి ఒక్క‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. అన‌సూయ కెరీర్‌లో దాక్షాయ‌ణి పాత్ర‌ గుర్తుండిపోయేదిగా ఉంటుంద‌ని అంటున్నారు.
 
కాగా, గతంలో రామ్ చరణ్ ప్రధానపాత్రలో వచ్చిన రంగస్థలం సినిమాలోని అనసూయ తన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాతో అనసూయ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. మూవీల్లోని కీలక పాత్రల కోసం ఆఫర్లు అనసూయకు ముందు క్యూ కట్టాయి.ఈ క్ర‌మంలోనే అన‌సూయ‌కు పుష్ప ఆఫ‌ర్ ద‌క్క‌గా, ఈ సినిమాతో మ‌రోసారి అద‌ర‌గొట్ట‌నుంద‌ని అంటున్నారు.