శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 15 ఏప్రియల్ 2024 (18:15 IST)

సాయి కుమార్ ముఖ్య పాత్రలో లక్ష్మీకటాక్షం నుండి మొదటి డైలాగ్ ఫస్ట్ లుక్

Lakshmikataksam First look
Lakshmikataksam First look
ఇప్పటి వరుకు తెలుగులో చాలా తక్కువ సటైరికల్ కాన్సెప్ట్స్ వచ్చాయి అందులోను పోలిటికల్ సటైరికల్ కామెడీ మాత్రం ఇంకా తక్కువ వచ్చాయి. ఇప్పుడు అదే తరహాలో ప్రేక్షకులని నవ్వించడానికి లక్ష్మీకటాక్షం సినిమా నుండి డైలాగ్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. రాజకియనాయకులు ఒక ఓటు కి ఇంత డబ్బులు అని నిర్ణయిస్తారు, కాని ఈ డైలాగ్ పోస్టర్ లో ఓటరే తన రేటును తాను నిర్ణయించుకుంటాడు. 
 
మహతి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వస్తున్న ఈ “లక్ష్మీకటాక్షం : ఫర్ ఓట్” కు రచన, దర్శకత్వం సూర్య అందించారు, యు. శ్రీనివాసుల రెడ్డి నిర్మించగా. అభిషేక్ రుఫుస్ సంగీతం అందించారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలకి చాలా ఆప్ట్ గా ఉంది ఈ డైలాగ్ పోస్టర్, అన్ని తరహ ప్రేక్షకుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. 
 
సీనియర్ నటులు సాయి కుమార్ మెయిన్ ముఖ్య పాత్రలో, వినయ్, అరుణ్, దీప్తి వర్మ మెయిన్ లీడ్స్ గా చేస్తున్నారు. ఈ కథ నేపధ్యం మొత్తం తాడిపత్రిలో చిత్రీకరించినట్టు యూనిట్ పేర్కొన్నారు. త్వరలోనే సరదాగా ఉండే టీసర్ ట్రైలర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తాం అని వెల్లడించారు