ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 31 జులై 2023 (12:14 IST)

"చంద్రముఖి-2" నుంచి కొత్త లుక్ రిలీజ్ - సినిమా విడుదల ఎపుడంటే...

chandramukhi
సీనియర్ దర్శకుడు పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం చంద్రముఖి-2. కంగనా రనౌత్, రాఘవా లారెన్స్‌లు ప్రధాన పాత్రను పోషించారు. గత 2005లో వచ్చిన చంద్రముఖి చిత్రానికి సీక్వెల్. తొలి భాగంలో సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార, జ్యోతిక, వడివేలు, నాజర్ తదితరులు నటించారు. ఈ రెండో భాగంలో కంగనా రనౌత్, రాఘవ లారెన్స్, వడివేలు తదితరులు నటించారు. 
 
సెప్టెంబరు 15వ తేదీన తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, మలయాళ భాషల్లో విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి తాజాగా రాజు పాత్రకు సంబంధించిన స్టిల్స్‌ను రిలీజ్ శారు. ఇందులో రాఘవ లారెన్స్ రాజుగారి గెటప్‌లో ఓ బంగళా మెట్లు దిగివస్తున్నాడు. లైకా ప్రొడక్షన్ బ్యానరుపై నిర్మితమైన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. 
 
కాగా, పి.వాసు - లారెన్స్ కాంబినేషన్‌లో 2017లో శివలింగ అనే చిత్రం వచ్చింది. హారర్ కామెడీ జోనర్‌లో వచ్చిన ఈ చిత్రం బాగానే ఆడింది. ఆ తర్వాత వారిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఇదే కావడం గమనార్హం. చంద్రముఖి చిత్రానికి విద్యా సాగర్ సంగీతం సమకూర్చగా, రెండో భాగానికి కీరవాణి సంగీతం అందించారు.