మంగళవారం, 25 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Last Updated : మంగళవారం, 14 అక్టోబరు 2025 (17:50 IST)

Nayanatara: మన శంకరవరప్రసాద్ గారు నుంచి ఫస్ట్ సింగిల్ మీసాల పిల్ల రిలీజ్

Mana Shankaravara Prasad's first single Meesala Pilla song
Mana Shankaravara Prasad's first single Meesala Pilla song
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ ప్రోమోకు రికార్డ్ వ్యూస్‌ను సాధించింది, ఇప్పటికే లెక్కలేనన్ని ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ తో సంచలనం సృష్టించింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయిక. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను శ్రీమతి అర్చన గర్వంగా సమర్పిస్తున్నారు.
 
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మీసాల పిల్ల లిరికల్ వీడియో విడుదలైంది. భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ ట్రాక్ పవర్ ఫుల్ ఎలక్ట్రానిక్ బీట్స్, పంచ్ బాస్ లైన్స్, మెలోడీలతో అదిరిపోయింది. భాస్కరభట్ల సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉదిత్ నారాయణ్ చాలా కాలం తర్వాత మెగాస్టార్ సినిమా కోసం పాడటానికి తిరిగి రావడం బిగ్గెస్ట్ హైలైట్‌లలో ఒకటి. నోస్టాల్జిక్ వాయిస్ మరింత వైబ్ యాడ్ చేసింది. శ్వేతా మోహన్ వోకల్స్ మరింత బ్యూటీని యాడ్ చేసింది 
 
చిరంజీవి చార్మింగ్, స్టైలిష్‌ సూట్‌లో కనిపిస్తూ తన ట్రేడ్‌మార్క్‌ మెగా గ్రేస్‌ను స్టైలిష్‌ డ్యాన్స్‌ మూవ్స్‌తో అదరగొట్టారు. విజయ్‌ పొలాకి అందించిన కొరియోగ్రఫీ ఫ్యాన్స్‌కు విజువల్‌ ట్రీట్‌లా మారింది. చిరంజీవి విన్టేజ్‌ డ్యాన్స్‌ స్టైల్‌ ప్రేక్షకులుని అద్భుతంగా అలరించ్బింది. నయనతార అందమైన చీరలో మెరిసింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ మ్యాజికల్ గా వుంది. 
 
మ్యూజిక్‌ కంపోజిషన్‌, లిరిక్స్‌, కొరియోగ్రఫీ, లీడ్‌ పెయిర్ కెమిస్ట్రీ.. ఇవన్నీ కలిసి కలర్ ఫుల్ సెట్‌ల మధ్య అద్భుతమైన వైబ్ క్రియేట్ చేశాయి. మీసాల పిల్ల పాట ఇన్‌స్టంట్‌ చార్ట్‌బస్టర్‌గా నిలుస్తోంది.
 
‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రానికి స్ట్రాంగ్ టెక్నికల్‌ టీమ్‌ పని చేస్తోంది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఎస్. కృష్ణ, జి. ఆది నారాయణ సహ రచయితలు. ఎస్. కృష్ణ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా పనిచేస్తున్నారు.
 
మన శంకరవరప్రసాద్ గారు 2026లో సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లలోకి రానుంది.