శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 30 నవంబరు 2022 (11:12 IST)

"వారసుడు" నుంచి రంజితమే ఫుల్ సాంగ్ రిలీజ్

ranjithame song
విజయ్ హీరోగా నటించిన ద్విభాషా చిత్రం "వారసుడు". రష్మికా మందన్నా హీరోయిన్. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళం భాషల్లో నిర్మించారు. సంక్రాంతికి విడుదలకానున్న ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా, "రంజితమే" అనే పాటను తాజాగా రిలీజ్ చేశారు.  
 
"బొండుమల్లె చెండూ తెచ్చా.. భోగాపురం సెంటూ తెచ్చా.. కళ్ళకేమో కాటుక తెచ్చా.. వడ్డాణం నీ నడుముకిచ్చా" అంటూ ఈ పాట నడక సాగుతుంది. థమన్ సంగీత స్వరాలు సమకూర్చగా, రామజోగయ్య శాస్త్రీ సాహిత్యాన్ని అందించారు. అనురాగ్ కులకర్ణి, మనసి ఆలపించారు. జానీ మాస్టారు నృత్యాలు సమకూర్చారు.
 
ఎంతో హుషారుగా సాగే ఈ పాటలో, విజయ డ్యాన్స్ ఆకట్టుకుంది. మరోమారు ఆయన తన ఎనర్జీ లెవెల్స్ చూపించిన పాట ఇది. గ్రాఫిక్స్‌లోనే అయినప్పటికీ కలర్‌ఫుల్ పూల నేపథ్యంలో కంటికి ఎందో అందంగా కనిపించేలా ఈ పాటను చిత్రీకరించారు. జనవరి 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.