శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 28 ఆగస్టు 2017 (10:36 IST)

అంబానీ ఇంట గణేష్ చతుర్థి వేడుకలు ... తరలివచ్చిన బాలీవుడ్ (Video)

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట గణేష్ చతుర్థి వేడుకలు శనివారం రాత్రి అంగరంగవైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు బాలీవుడ్ తారాగణం తరలివచ్చింది. ఈ సందర్భంగా ముఖేష్ అంబానీ భారీ పార్టీ ఇచ్చారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట గణేష్ చతుర్థి వేడుకలు శనివారం రాత్రి అంగరంగవైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు బాలీవుడ్ తారాగణం తరలివచ్చింది. ఈ సందర్భంగా ముఖేష్ అంబానీ భారీ పార్టీ ఇచ్చారు.
 
ఈ వేడుకల్లో బాలీవుడ్ బిగ్-బి అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, దీపికా పదుకునే, రణవీర్ సింగ్, ప్రియాంకాచోప్రా, రణబీర్ కపూర్, కరణ్ జొహార్, కాజోల్, హేమమాలిని తదితరులు పార్టీలో సందడి చేశారు.
 
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన భార్య అంజలి, కుమారుడు అర్జున్‌లతో కలసి వచ్చాడు. సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్, శ్రీదేవి కుమార్తె జాహ్నవి కపూర్‌లు కూడా పార్టీలో హల్ చల్ చేశారు.