'''బిగ్ సి'తో మెమరబుల్ ఎక్స్ పీరియన్స్. 20వ వార్షికోత్సవం సందర్భంగా 'బిగ్ సి'కి బిగ్ కంగ్రాచ్యులేషన్'' అని అభినందించారు సూపర్ స్టార్ మహేష్ బాబు. 'బిగ్ సి' 20వ వార్షికోత్సవం వేడుకల్లో పాల్గొన్నారు మహేష్ బాబు. ఈ వేడుకలో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 ఫోన్స్ ని లాంచ్ చేశారు మహేష్ బాబు.
ఈ సందర్భంగా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. 20వ వార్షికోత్సవం సందర్భంగా 'బిగ్ సి'కి బిగ్ కంగ్రాట్యులేషన్. ఇరవై ఏళ్ళు పూర్తి చేయడం అంటే మామూలు విషయం కాదు. బిగ్ సి, స్వప్న కుమార్, వారి టీంకు అభినందనలు. గత రెండేళ్ళుగా వారితో నా అసోషియేషన్ వుంది. ఇది మెమరబుల్ ఎక్స్ పీరియన్స్. వారితో అసోషియేషన్ కొనసాగాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు మహేష్ బాబు.
బ్రాండ్ అంబాసిడర్‌గా చేయడం ద్వారా వచ్చిన ఆదాయంతో చాలా సేవకార్యక్రమాలు చేస్తున్నారు కదా.. దీనికి స్ఫూర్తి ఎలా వస్తోంది ?
సేవ చేయాలనే స్ఫూర్తి చిన్నప్పటినుంచి వుంది. గౌతమ్ పుట్టిన తర్వాత ఎంబీ ఫౌండేషన్ కి శ్రీకారం చుట్టాం. చిన్నారుల గుండె ఆపరేషన్లకు నా వంతు సహకారం అందిస్తున్నా. అలాగే రీ-రిలీజ్‌ల ద్వారా వచ్చిన మొత్తాన్ని కూడా సాయం కోసమే ఇస్తున్నా. ఈ విషయంలో నాకు చాలా తృప్తి వుంది.
స్మార్ట్ ఫోన్ రోజులో ఎంత సమయం వాడుతారు ?
మీ అందరిలానే చాలా సమయం వాడుతాను. ఒకొక్కసారి తలకాయ నొప్పి వచ్చి ఆపేయడానికి కూడా ప్రయత్నిస్తాను.
మీరు వాడే ఫోన్ ఏమిటి ? ఎన్ని ఫోన్లు మారుస్తారు ?
నేను చెప్పను. నేను తిరిగేటప్పుడు మీరే పరిశీలించండి( నవ్వుతూ)
మీరు అంబాసిడర్ గా చేసిన ప్రొడక్ట్స్ ని వాడుతారా ?
బిగ్ సి లో నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని వాడాను.
మీరు తీసిన ఫొటోస్ లో బాగా గుర్తుండిపోయిన ఫోటో ఏది ?
చాలా ఉంటాయండి.
ఫోన్ వాడకంలో మీ పిల్లలకు కూడా స్వేచ్ఛ ఇస్తారా ?
నేను ఇవ్వడం ఏమిటి .. వాళ్ళే తీసుకున్నారు (నవ్వుతూ)
మీ ఫోన్ రింగ్ టోన్ ఏమిటి ?
నాది సైలెంట్ టోన్ (నవ్వుతూ).
మీరు ఫోన్ కొనుక్కోవడానికి వెళ్ళినపుడు మీ అనుభూతి ఎలా వుంటుంది ?
నాకు సంబంధించిన వస్తువులన్నీ నా భార్య కొనుక్కొని తీసుకొస్తుంది. అయితే నేరుగా వెళ్లి బిగ్ సి లాంటి స్టోర్స్ లో ఫోన్ కొనుక్కోవడంలో ఆనందం వేరుగా వుంటుంది.