శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డివి
Last Updated : శుక్రవారం, 15 జనవరి 2021 (12:27 IST)

నాకు ఇష్ట‌మైన ద‌ర్శ‌కుల్లో కేవి గుహ‌న్ ఒక‌రు : మ‌హేష్ బాబు

www
`118` వంటి సూప‌ర్‌హిట్ చిత్రాన్నితెర‌కెక్కించిన ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కేవి గుహన్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతోన్నలేటెస్ట్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ ‌`డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు`(ఎవ‌రు, ఎక్క‌డ‌, ఎందుకు). అథిత్ అరుణ్‌, శివాని రాజ‌శేఖ‌ర్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని రామంత్ర క్రియేష‌న్స్ ప‌తాకంపై డా. ర‌వి పి. రాజు దాట్ల నిర్మిస్తున్నారు. మ‌క‌ర సంక్రాంతి పండ‌గ‌ సంద‌ర్భంగా `డ‌బ్ల్యుడ‌బ్ల్యుడ‌బ్ల్యు` మూవీ టీజ‌ర్‌ను సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా...
 
సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు మాట్లాడుతూ - ``నాకు ఇష్ట‌మైన టెక్నీషియ‌న్స్‌లో కేవి గుహ‌న్ గారు ఒక‌రు. ఆయ‌న‌తో చాలా మంచి సినిమాల‌కు వ‌ర్క్‌ చేశాను. ఇప్పుడు ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `డ‌బ్ల్యుడ‌బ్ల్యుడ‌బ్ల్యు`టీజ‌ర్ రిలీజ్ చేయ‌డం హ్యాపీగా ఉంది. టీజ‌ర్ చూశాను చాలా బాగుంది సినిమా త‌ప్ప‌కుండా హిట్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను. టీమ్ అంద‌రికీ నా బెస్ట్ విషెస్‌`` అన్నారు.
 
ద‌ర్శ‌కుడు కేవి గుహ‌న్ మాట్లాడుతూ  -  ``టెక్నీషియ‌న్స్‌కి ఎంతో గౌర‌వం ఇచ్చే మంచి వ్య‌క్తి మ‌హేష్‌బాబు గారు. మ‌హేష్‌గారితో `అత‌డు`, `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`, `దూకుడు` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్‌కి వ‌ర్క్ చేశాను. ఆయ‌న‌తో వ‌ర్క్ చేయ‌డం ఎప్పుడూ హ్యాపీగా ఉంటుంది. అలానే నేను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మొద‌టి చిత్రం `118` చూసి న‌న్ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. నా మీద అభిమానంతో `డ‌బ్ల్యుడ‌బ్ల్యుడ‌బ్ల్యు` టీజ‌ర్ విడుద‌ల చేయ‌డం చాలా హ్యాపీగా ఉంది. ఇది ఈ చిత్రం విజ‌యానికి శుభ‌సూచ‌కం`` అన్నారు.
 
చిత్ర నిర్మాత డా. ర‌వి పి.రాజు దాట్ల  మాట్లాడుతూ - `` మా రామంత్ర క్రియేష‌న్స్ బేన‌ర్‌లో రూపొందుతోన్న ఫ‌స్ట్ మూవీ `డ‌బ్ల్యుడ‌బ్ల్యుడబ్ల్యు`. మా మొద‌టి సినిమా టీజ‌ర్‌ మ‌హేష్ బాబు గారి లాంటి సూప‌ర్‌స్టార్ లాంచ్ చేయ‌డం ఆనందంగా, గ‌ర్వంగా ఉంది. మ‌హేష్ బాబు గారి గోల్డెన్ హ్యాండ్‌తో రిలీజైన మా టీజ‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. గుహ‌న్ గారు ఈ సినిమాని అద్బుతంగా తెర‌కెక్కించారు. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంద‌ని న‌మ్మ‌కం ఉంది`` అన్నారు.
 
హీరో అథిత్ అరుణ్ మాట్లాడుతూ -  ``ఎంతో మందికి ఇన్స్‌పిరేష‌న్ అయిన సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు గారు మా `డ‌బ్ల్యుడ‌బ్ల్యుడ‌బ్ల్యు` టీజ‌ర్ లాంచ్ చేయ‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయ‌న‌కి నా కృత‌జ్ఞ‌త‌లు. గుహ‌న్ గారు ఈ సినిమా ఎంతో థ్రిల్లింగ్‌గా తీశారు`` అన్నారు.
 
హీరోయిన్ శివాని రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ  -  ``నాన్న గారికి మ‌హేష్‌బాబు గారికి మంచి అనుభందం ఉంది. మా అంద‌రికీ మ‌హేష్‌బాబు అంటే చాలా ఇష్టం. నా తొలిచిత్రం టీజ‌ర్ మ‌హేష్‌బాబు గారు లాంచ్ చేయ‌డం చాలా థ్రిల్‌గా ఉంది`` అన్నారు.
 
కో - ప్రొడ్యూస‌ర్ విజ‌య్ ధ‌ర‌న్ దాట్ల మాట్లాడుతూ - ``ఎంతో బిజీగా ఉండి కూడా గుహ‌న్ గారి మీద అభిమానంతో టీజ‌ర్‌ని రిలీజ్‌చేసి మా సంస్థ‌ని ఎంత‌గానో ప్రోత్సహిస్తున్న మహేష్‌బాబుగారికి స్పెష‌ల్ థ్యాంక్స్‌. ప్ర‌‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే రిలీజ్‌కి స‌న్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.
 
అథిత్ అరుణ్‌, శివాని రాజ‌శేఖ‌ర్, ప్రియ‌ద‌ర్శి, వైవా హ‌ర్ష త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి
బ్యాన‌ర్‌: రామంత్ర క్రియేష‌న్స్,
సంగీతం: సిమ‌న్ కె. కింగ్‌,
ఎడిటింగ్‌: త‌మ్మిరాజు,
ఆర్ట్‌: నిఖిల్ హ‌స‌న్‌,
డైలాగ్స్‌: మిర్చి కిర‌ణ్‌,
లిరిక్స్‌: రామ‌జోగ‌య్య‌శాస్త్రి, అనంత‌ శ్రీ‌రామ్‌,
కొరియోగ్ర‌ఫి: ప‌్రేమ్ ర‌క్షిత్,
స్టంట్స్‌: రియ‌ల్ స‌తీష్‌,
కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: పొన్మ‌ని గుహ‌న్‌,
ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: కె. రవి కుమార్‌,
కో-ప్రొడ్యూస‌ర్‌: విజ‌య్ ధ‌ర‌ణ్ దాట్ల,
నిర్మాత‌: డా. ర‌వి పి.రాజు దాట్ల,
క‌థ‌, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్ర‌ఫి, ద‌ర్శ‌క‌త్వం: కె వి గుహ‌న్‌.