మంగళవారం, 26 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By కుమార్
Last Updated : గురువారం, 16 మే 2019 (18:17 IST)

ఫేస్‌బుక్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఏంటది?

ఫేస్‌బుక్‌ను వినియోగిస్తున్న వారికి ఇది శుభవార్త. ఇతరులతో పోలిస్తే ఫేస్‌బుక్‌ వినియోగదారుల జీవితకాలం ఎక్కువని నిర్ధారణ అయింది. సోషల్‌ మీడియాను వినియోగిస్తున్న కోట్ల సంఖ్యలోని వినియోగదారులతో నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. అయితే ఆన్‌లైన్‌లో స్నేహితులను పెంచుకోవడంతో పాటు బాహ్య ప్రపంచంలోనూ మంచి సంబంధ, బాంధవ్యాలు కలిగి ఉండేవారే చిరకాలం సంతోషంగా జీవిస్తారని శాస్త్రవేత్తలు అంటున్నారు. 
 
గడిచిన ఆరు నెలలుగా యుఎస్‌లోని కాలిఫోర్నియాకు చెందిన ఫేస్‌బుక్‌ వినియోగదారుల ఆన్‌లైన్‌ కార్యకలాపాలను అధ్యయనం చేశారు. ఆన్‌లైన్‌ స్నేహితుల సంఖ్య, వారు పోస్ట్‌ చేసిన ఫొటోలు, స్టేటస్‌ అప్‌డేట్స్‌, పంపిన మెసేజ్‌ల సంఖ్య మొదలైన అంశాలను ప్రామాణికంగా తీసుకున్నప్పుడు అన్‌లైన్‌లో యాక్టివ్‌గా ఉన్నవారు, ఎక్కువ సంఖ్యలో ఫ్రెండ్షిప్‌ రిక్వె‌స్ట్‌లు యాక్సెప్ట్‌ చేసినవారు ఎక్కువకాలం జీవిస్తున్నారని తేలింది.
 
అయితే ఆన్‌లైన్‌లో ఉండమన్నారు కదా అని అదే పనిగా రోజుల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుంటే ఆయుర్దాయం పెరగడం మాట అటుంచి, శారీరకంగా, మానసికంగా ఎన్నో దుష్ప్రభావాల బారినపడే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆఫ్‌లైన్‌ స్నేహాలను, ఆన్‌లైన్‌ స్నేహాలను చక్కగా సమన్వయం చేసుకోవాలని సూచిస్తున్నారు.