సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 2 సెప్టెంబరు 2024 (15:04 IST)

విశ్వం లో శ్రీనువైట్ల వినోదాన్ని నమ్ముకున్న గోపీచంద్

Gopichand
Gopichand
కథానాయకుడు గోపీచంద్ ఎన్ని సినిమాలు చేసినా పెద్దగా వర్కవుట్ కావడంలేదు. మాస్, యాక్షన్ సినిమాలు చేసినా సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. మరోవైపు దర్శకుడు శ్రీనువైట్లకు కూడా పెద్దగా సక్సెస్ లేదు. కొంతకాలం గేప్ తీసుకున్నారు. ఇప్పుడు వారిద్దరూ కలిసి విశ్వం అనే సినిమా చేయబోతున్నారు. షూటింగ్ కూడా చివరి దశలో చేరుకున్న ఈ సినిమా గురించి రేపు టీజర్ ను విడుదల చేయనున్నారు.
 
ముందుగా గోపీచంద్ స్టయిలిష్ లుక్ ను విడుదలచేశారు. ఇందులో యాక్షన్ తోపాటు వినోదం పాల్ళు ఎక్కువుగా వుంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. అందుకే గోపీచంద్ కథను అంగీకరించాడని తెలుస్తోంది. కావ్యథాపర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను  చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై డిస్ట్రిబ్యూటర్‌ కమ్‌ ఎగ్జిబిటర్‌ వేణు దోనెపూడి నిర్మిస్తున్నారు. ఇందుకు  పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ కూడా నిర్మాణానికి తోడయింది. గోపీమోహన్‌ స్క్రీన్‌ ప్లే, చేతన్ భరద్వాజ్‌ మ్యూజిక్, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నారు.