సోమవారం, 24 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 19 జనవరి 2024 (14:20 IST)

రమణగాడి గుంటూరు కారంలో పొరపాటు మాదే : నిర్మాత నాగవంశీ

Producer Nagavanshi
Producer Nagavanshi
సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో మహేష్ బాబు సినిమా గుంటూరు కారం డివైడ్ టాక్ వచ్చింది. ఇలా రావడానికి మా తప్పిదం కూడా ఓ కారణమని అది ముందుగానే గ్రహించలేకపోయామని చిత్ర నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ స్పష్టం చేశారు. రిలీజ్ కు ముందు మహేష్ బాబుతోకానీ, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తోకానీ ఇంటర్వూ ప్లాన్ చేయలేకపోయాం. విడుదల దగ్గరపడడం ప్రమోషన్ కు సమయం లేకపోవడం వల్ల ఇలా జరిగిందని అన్నారు.
 
రిలీజ్ కుముందు నాడు ఒంటిగంట షో వేయడంతో తప్పిదం జరిగిందనీ, దానివల్ల కొంతమంది సోషల్ మీడియాలో గుంటూరు కారం గురించి చిలువలు పలువలు రాశారనీ అయినా అవన్నీ మాపై వున్న ప్రేమతోనే రాశారని భావిస్తున్నామని అన్నారు. శుక్రవారం సంస్థ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ముందునుంచి మహేష్ బాబు చాలా విజయంతో నమ్మకంతో వున్నారు. అలాగే సండే నుంచి కలెక్షన్లు బాగున్నాయి. అందుకే మేం మీడియా ముందుకు వచ్చాం. గుంటూరు కారం కలెక్షన్లు ఫేక్ కాదు నిజం అని గట్టిగా చెబుతున్నానని అన్నారు.