బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 12 జనవరి 2024 (17:55 IST)

సెంటిమెంట్ గా సుదర్శన్ 35MMలో గుంటూరు కారం చూసిన మహేష్

Mahesh, trivikram
Mahesh, trivikram
తాను నటించిన గుంటూరు కారం సినిమాను మహేష్ బాబు తన కుటుంబ సభ్యులు, సన్నిహితులతో ఈరోజు సినిమాను వీక్షించారు. సెంటిమెంట్ గా ప్రతి సినిమాను హైదాబాద్ లోని సుదర్శన్ 35MMలో క్రిష్ణ గారు చూసేవారు. అలా వారసత్వంగా దాన్ని మహేష్ బాబు కడా కొనసాగించారు.
 
gowtam, namrata and others
gowtam, namrata and others
ఈరోజు శుక్రవారం ఉదయం ఆటను చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ తోపాటు తన భార్య నమ్రత, కుమారుడు గౌతమ్ తోపాటు ఇతర కుటుంబ సభ్యులుతో తిలకించారు. థియేటర్ లో మహేష్ రాక సందర్భంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. 
 
mahesh at sudharshan
mahesh at sudharshan
సినిమా అనంతరం ఆయన్ను అభిమానులు పలుకరించగా, మీతో పాటు సినిమాను చూడడం నాకు చాలా ఆనందంగా వుంది అన్నారు. క్రిష్ణ గారిని గుర్తు చేసుకుని మీ అభిమానంవల్లే ఇంతటి వాడినయ్యాను అంటూ తెలిపారు. సినిమా చూస్తున్నంతసేపు మీరు పొందుతున్న ఆనందం నాకు ఎనర్జీ ఇచ్చిందన్నారు.