ఆదివారం, 17 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : బుధవారం, 17 జనవరి 2024 (13:21 IST)

హనుమాన్ కు అక్కడ ఆదరణ వున్నా ఇక్కడ బ్రేక్ లు పడుతున్నాయి. కారణం? స్పెషల్ స్టోరీ

sivaraj kumar family with hanuman team
sivaraj kumar family with hanuman team
తెలుగు సినిమారంగంలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా నిలిచింది నాలుగు సంక్రాంతి సినిమాలు. అందులో బాలనటుడిగా ఇంద్ర సినిమాతో ఎంటర్ ఇచ్చి హీరోగా జాంబిరెడ్డి తో పేరు తెచ్చుకున్న నటుడు హనుమాన్ తో సంక్రాంతి బరిలోకి దిగాడు. దిగినప్పటినుంచీ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాలలో సరైన నిష్పత్తిలో థియేటర్ లు లభించలేదు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారంకు ఫుల్ గా థియేటర్లు వున్నాయి. 
 
ఇక ఆ తర్వాత వెంకటేష్ నటించిన సైంథవ్ కూ థియేటర్లు సమస్య లేకున్నా ముందు దూకాడు ఇక నాగార్జున సంక్రాంతి సెంటిమెంట్ గా నా సామిరంగా అంటూ తన సత్తా నిరూపించుకోవాలని దిగారు. ఇలా నాలుగు సినిమాలు సంక్రాంతి బరిలో వుంటే తేజ్ సజ్జ నటించిన హనుమాన్ సినిమాకు యావత్ దేశమంతా ఆదరణ పొందింది. దాదాపు వంద కోట్ల క్లబ్ కు చేరుకుంది.  ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆనందంతో సోషల్ మీడియాలో ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. 
 
kaaram, saidhav, naasamiranga
kaaram, saidhav, naasamiranga
అందుకే ధైర్యంగా సంక్రాంతి రోజే హనుమాన్ హీరో టీమ్ బెంగుళూరు వెళ్ళింది.  'కరునాడ చక్రవర్తి'  నిమ్మశివన్నతో #హనుమాన్ స్పెషల్ షో చూసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. శివరాజ్ కుమార్ కుటుబంతో సహా సినిమా తిలకించి పరశించిపోయారు. 
 
అయితే అదేరోజు తెలంగాణాలో బుక్ మై షో లో పూర్తిగా ఫుల్ గా వున్న హనుమాన్ సినిమా షోను ఐమాక్స్ లో అర్థంతరంగా కాన్సిల్ చేశారు.  ఇందుకు కారణం సాంకేతికంగా అని యాజమాన్యం చెబుతున్నా, ఇంకా హనుమాన్ కలెక్షన్లకు పేరు మోసిన పంపిణీదారుడు చేసిన జిమ్మిక్కుగా విశ్లేషకులు అంచనాకు వచ్చారు. ఇటీవలే చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి ఫిలిం ఛాంబర్ కు నిర్మాతలమండలికి తమకు ఇవ్వాల్సిన థియేటర్లు ఇవ్వకుండా అడ్డుకున్నారనీ అందుకు ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు పాత్ర వుందని తెలియజేస్తూ లిఖితపూర్వకంగా తెలియజేశారు. దాని పర్యావసానంగా నష్టాన్ని థియేటర్ల యాజమాన్యం హనుమాన్ నిర్మాతకు ఇవ్వాలని అంతే లిఖితపూర్వకంగా మీడియాకు తెలిపింది. కానీ ఆ తర్వాతే ఐమాక్స్ వంటి థియేటర్లలో హనుమాన్ సినిమా రద్దు చేయడం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. వీటివెనుక కొన్ని శక్తులు వున్నాయని తెలియవచ్చింది.
 
టాలీవుడ్ లో నాగార్జున హీరోగా ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా దర్శకుడు విజయ్ బిన్నీ తెరకెక్కించిన సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “నా సామిరంగ” సంక్రాతి మూడు రోజుల్లో నైజాం – 1.05 కోట్లు, సీడెడ్ – 60 లక్షలు,  వైజాగ్ – 51 లక్షలు, తూర్పు గోదావరి – 44 లక్షలు,  వెస్ట్ గోదావరి – 22 లక్షలు, కృష్ణ – 24 లక్షలు, గుంటూరు – 34 లక్షలు, నెల్లూరు – 18 లక్షలు తో  మొత్తం – 3.58 కోట్లు షేర్ ని నా సామిరంగ మూడో రోజు అందుకోగా ఈ మొత్తం మూడు రోజుల్లో ఈ చిత్రం 12.46 కోట్ల షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకుందని ట్రేడ్ వర్గాలు రిపోర్ట్ అందజేశాయి. ఓవర్ సీస్ తో కలిపి మొత్తం 24.8 కోట్ల షేర్ అందుకొని సాలిడ్ రన్ తో నిర్మాతకు సేఫ్ గా నిలుస్తందనే టాక్ వినిపిస్తోంది. 
 
ఇక మహేష్ బాబు హీరోగా శ్రీలీల హీరోయిన్ గా  త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కించిన మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “గుంటూరు కారం” మిక్స్డ్ టాక్ తో కూడా సాలిడ్ వసూళ్లు అందుకుని ముందుకు సాగుతుందని చిత్ర యూనిట్ తెలుపుతోంది. ఇక యూఎస్ మార్కెట్ లో ఈ చిత్రం 2.4 మిలియన్ డాలర్స్ ని అందుకోగా నెక్స్ట్ మైల్ స్టోన్ 2.5 మిలియన్ కి దగ్గరవుతుందని తెలుస్తోంది. కాగా, ఇంత వసూలు చేసినా ఈ సినిమా సేఫ్ ప్రాజెక్ట్ గా నిర్మాతకు నిలవడం కష్టమనే తెలుస్తోంది. ఈ సినిమా పట్ల నిర్మాత రాధాక్రిష్ణ చాలా అసంత్రుప్తి వున్నట్లు సమాచారం. ఇక వీటిపై చర్చించేందుకు దర్శకుడు త్రివిక్రమ్ ఎవరికీ అందుబాటులో లేకుండా ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నారని చిత్ర యూనిట్ తెలియజేస్తుంది.
 
మరోవైపు విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ సైంధవ్. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ విలన్ గా నటించిన ఈ మూవీని శైలేష్ కొలను తెరకెక్కించగా నిహారికా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి గ్రాండ్ లెవెల్లో నిర్మించారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఈ మూవీ యుఎస్ఏ లో 200కె డాలర్స్ కి పైగా కలెక్షన్ ని అందుకున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. సినిమా కథ ప్రకారం పదిహేడు కోట్ల ఇంజక్షన్ అనే కాన్సెప్ట్ కొత్తగా వున్నా,  అది ప్రేక్షకుడికి కనెక్ట్ కాలేదని తెలుస్తోంది. ఈ సినిమా వల్ల నిర్మాత కొంచెం నష్టమే మిగులుతుందని ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి.
 
మొత్తంగా చూస్తే, హనుమంతుడికి ముందు ఎన్ని కుప్పిగంతులు వేసినా ఆ స్థాయికి వెళ్లలేరని మిగిలిన సినిమాలు ద్వారా తెలియడం విశేషమే. చిన్న సినిమాలకు థియేటర్ల సమస్య వుందనీ ఎంతో కాలంగా వారు పోారాడుతున్నా కంటితుడుపు చర్యగా కొన్ని కొంతమందికిి కొన్ని చర్యలతో చల్లపరుస్తున్నారు.  ఈసారి అది మరింత బహిర్గతం అయి ప్రముఖ పంపిణీదారుడు, ఎగ్జిబిటర్ అయి ఓ వ్యక్తిని దోషిగా నిలబెట్టాయి. కానీ అవన్నీ అసత్యాలని గిట్టనివారు ఏదో రాస్తున్నారని మీడియా ముందుకు వచ్చిన ఆ వ్యక్తి ఇప్పటికైనా మారాలని చిన్న నిర్మాతలు ముక్తకంఠంతో తెలియజేస్తున్నారు.