బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శనివారం, 13 జనవరి 2024 (19:04 IST)

హనుమాన్ పవర్ కు గుంటూరు కారమేకాదు బాలీవుడ్ సినిమాలు సప్పబడ్డాయి- రివ్యూ

gunturu karam vs hanuman
gunturu karam vs hanuman
ఈ సంక్రాంతికి ఐదు సినిమాలు తెలుగులో విడుదలకావాల్సి వుండగా, పోటీనుంచి రవితేజ ఈగిల్ తప్పుకున్నాడు. అంతకుముందు చిత్ర నిర్మాత విశ్వప్రసాద్ తగ్గేదె లే అని భీష్మించుకూర్చుంటే ఛాంబర్ అధ్యక్ష హోదాలో దిల్ రాజు భేటీతో వెనక్కు తగ్గారు. అయితే మిగిలిన నాలుగు సినిమాలలో హనుమాన్ సినిమా చిన్న హీరో తేజ్ సజ్జ. నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త నిర్మాత. చిన్నపాటి పంపిణీ అనుభవం వున్నా ఇక్కడ పనిచేలేదు.

కాకపోతే యూనివర్సల్ కాన్సెప్ట్ తోపాటు అప్పటికే బాలీవుడ్ లో విడుదల తేదీ ప్రకటించడంతో అక్కడ క్రేజ్ వచ్చేసింది. ప్రమోషన్ లో వారికి అక్కడి వారు బ్రహ్మరథం పట్టారు. కానీ తెలుగులో థియేటర్ లు ఇవ్వలేదు. కనీసం  వంద థియేటర్ లు ఉంటె 20 ఇవ్వమన్నా ఇవ్వలేదు. దాంతో అంతా హనుమంతుడి చూసుకుంటాడని ధైర్యంగా ఉన్నారు. ఇప్పడు అదే నిజమైంది. 
 
అయినా,  చిన్న హీరో సినిమా తప్పుకుంటే బెటర్ అని ఇన్ డైరెక్ట్ గా డీలా రాజు  సూచించారు. దానికి తగినట్లు హనుమాన్ సినిమాను మైత్రీ మూవీస్ పంపిణీ చేస్తే అందుకు థియేటర్ కూడా పెద్దగా ఇవ్వలేదు. ఉన్న థియేటర్లలో గుంటూరు కారం వేశారని తెలియడంతో హనుమాన్ నిర్మాత, మైత్రీ మూవీస్ నిర్మాత మండలికి ఫిర్యాదు చేశారు.
 
ఆ తర్వాత గుంటూరు కారం కు వచ్చిన ఆదరణ చూసి దిల్ రాజు ఖంగు తిన్నారు. కానీ పైకి మాత్రం అద్భుతమైన కలెక్టన్లు  అని రిపోర్ట్ ఇచ్చాడు. 
 
ఇక బుక్ మై షోలో హనుమాన్ కు హౌస్ ఫుల్ కలెక్షన్లు వచ్చాయి. ఖాళీ లేదు. కానీ కారం కు ఖాలీగా కనిపించాయి. దాంతో హనుమాన్ దెబ్బకు గుంటూరు కారం సప్పపడిందనే టాక్ ఫిలిం నగర్లో వినిపిస్తోంది. ఎలాగూ సైంథవ్ కుపెద్దగా థియేటర్లు లేవు. 
 
విడుదలకు ముందు గుంటూరు కారం ఓపెనింగ్స్ బాగుంటే ప్రస్తుతం ఓటింగ్స్ పరంగా కూడా గుంటూరు కారం కి హను మాన్ చిత్రం సాలిడ్ పోటీ ఇస్తుండడం విశేషం.. సహజంగా ఓ స్టార్ హీరో సినిమా వస్తుంది అంటే దాని తాలూకా బుకింగ్స్ కానీ ఓటింగ్స్ లో కానీ మొదటి రోజు కంప్లీట్ అయ్యేసరికి ఈజీగా లక్షల్లో ఉంటాయి. ఒక మిడ్ రేంజ్ సినిమాగా వచ్చిన హను మాన్ కూడా 1 లక్షకి పై చిలుకు ఓటింగ్స్ రాబట్టగా గుంటూరు కారం కి కూడా లక్షకి పైగా రాబట్టింది.
 
ఇదిలా వుంటే బాలీవుడ్ లో హనుమాన్ కు ఆదరణ మామూలుగా లేదు. గత ఏడాదిలో ఏ దక్షిణాది సినిమాకు రాని కలెక్షన్లు వచ్చాయని హీరో తేజ సజ్జ తెలియజేయడం విశేషం.