1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 13 జనవరి 2024 (18:01 IST)

అలాంటి పాత్రలు చేయడానికి ఇష్టపడతాను: హీరోయిన్ అమృత అయ్యర్

Amrita Iyer
Amrita Iyer
నటనకు ఆస్కారం వుండే పాత్రలు చేయాలని వుంది. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అలాంటి పాత్రలు వచ్చినా చేయడానికి ఇష్టపడతాను. నా కెరీర్ పట్ల చాలా ఆనందంగా వుంది అని హీరోయిన్ అమృత అయ్యర్ అన్నారు. హనుమాన్ సినిమాలో ఆమె నటించింది. ఈ సినిమా విజయం పట్ల ఎంతో సంతోషం గా ఉన్నానని తెలిపింది. 
 
తేజ, వరలక్ష్మీ గారితో పని చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. తేజ చాలా మంచి నటుడు. తన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. అలాగే వరలక్ష్మీ గారితో కలసి పని చేయడం కూడా మంచి అనుభూతి. ఆమె నుంచి కూడా కొన్ని మెళకువలు నేర్చుకున్నాను. సెట్ లో అందరినీ పరిశీలిస్తాను. ప్రతి ఒక్కరి  నుంచి నేర్చుకోవానికి ఎదో ఒక విషయం వుంటుంది. హనుమాన్ వెరీ మెమరబుల్ జర్నీ. ఈ జర్నీలో సహనంగా వుండటం నేర్చుకున్నాను. ఒక ఆర్టిస్ట్ కి సహనం చాలా ముఖ్యం.
 
హనుమాన్ 2 ఉంటుందని ప్రశాంత్ గారు చెప్పలేదు. అందరితో కలసి స్క్రీన్ పై చూసినప్పుడు చాలా సర్ ప్రైజ్ అయ్యాను. నా లైఫ్ లో సూపర్ హీరో అమ్మ నాన్న. ఇప్పుడు నరేష్ గారి సినిమా మొదలైయింది. అందులో నా పాత్రకు చాలా ప్రాధన్యత వుంటుంది అని తెలిపారు.