ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 19 ఫిబ్రవరి 2024 (16:53 IST)

ఇద్దరు ఫ్రండ్స్ కృష్ణార్జునులైతే.. కాన్సెప్ట్ తో హద్దు లేదురా మూవీ చిత్రీకరణ

Ashish Gandhi, Hero Rohit, Hritika and others
Ashish Gandhi, Hero Rohit, Hritika and others
ఆశిష్‌ గాంధీ, అశోక్‌ హీరోలుగా వర్ష, హ్రితిక హీరోయిన్లుగా రాజశేఖర్ రావి దర్శకత్వంలో తెరకెక్కుతున్న  చిత్రం ”హద్దు లేదురా'. టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వర్ణ పిక్చర్స్  బ్యానర్స్ పై  వీరేష్ గాజుల బళ్లారి నిర్మిస్తున్నారు. రావి మోహన్ రావు సహా నిర్మాత. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ టీజర్ ని లాంచ్ చేశారు.
 
టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో ఆశిష్‌ గాంధీ మాట్లాడుతూ.. నేను నటించిన ‘నాటకం’ టీజర్ ఇక్కడే లాంచ్ అయ్యింది. అది చాలా మంచి హిట్ అయ్యింది. అలాగే హద్దులేదురా సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మా సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులని అలరిస్తుంది. నాటకం తర్వాత నేను విన్న కథ హద్దు లేదురా. అప్పటి నుంచి దర్శకుడు, నేను స్నేహితుల్లా ట్రావెల్ అవుతున్నాం. నిర్మాత వీరేష్ చాలా సపోర్ట్ చేశారు. అశోక్‌  వర్ష, హ్రితిక అందరూ అద్భుతంగా నటించారు. రాంబాబు గారు మంచి సాహిత్యం అందించారు. సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. ప్రతి ఒక్కరూ సినిమా చూసి ఆదరించాలి' అని కోరారు.
 
దర్శకుడు రాజశేఖర్ రావి మాట్లాడుతూ..  కృష్ణార్జునులు స్నేహంగా ఉంటూ వారి సమస్యలని ఎలా పరిష్కరించారో ఈ జనరేషన్ లో ఇద్దరు ఫ్రండ్స్ కృష్ణార్జునులైతే వారికి వచ్చిన సమస్యలని ఎలా పరిష్కరిస్తారో ఇప్పటి యూత్ కి కనెక్ట్ అయ్యేలా  చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఆల్రెడీ షో వేశాం. చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సురేష్ ప్రొడక్షన్ లాంటి గొప్ప సంస్థకి సినిమా నచ్చడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. అన్ని ఏజ్ గ్రూప్ ల వారికి ఈ సినిమా నచ్చుతుంది. కమల్ కుమార్ గారు అద్భుతమైన ఐదు పాటలు ఇచ్చారు. ఆయన ఈనాడు మన మధ్య లేకపోవడం చాలా బాధకరం.  ఆయన ఇచ్చిన పాటలు ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోతాయి. త్వరలోనే పాటలని విడుదల చేస్తాం. ఈ సినిమాలో క్లైమాక్స్ చాలా అద్భుతంగా వచ్చింది. ప్రేక్షకులని కంటెంట్ ని నమ్ముకొని ఈ సినిమా చేశాం.  నిర్మాత వీరేష్ అద్భుతంగా సపోర్ట్ చేశారు.  ఈ ప్రయాణంలో హీరో ఆశిష్‌ గాంధీ ఎంతో సహకరించారు. చాలా ఇష్టంగా చేసిన సినిమా ఇది. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం వుంది'' అన్నారు
 
హీరో రోహిత్ మాట్లాడుతూ..స్నేహంతో ముడిపడిన సినిమా ఇది. స్నేహం నేపధ్యంలో వచ్చిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి. ఇది కూడా పెద్ద విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం వుంది. ఈ సినిమాని ప్రేక్షకులు థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయాలని కోరుతున్నాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందనే నమ్మకం వుంది'' అన్నారు
 
హీరోయిన్ హ్రితిక మాట్లాడుతూ.. దర్శకుడు అద్భుతంగా ఈ సినిమాని తీశారు. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకమైనది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు.  సినిమా అద్భుతంగా వచ్చింది. తప్పకుండా అందరూ థియేటర్స్ లో చూడాలి' అని కోరారు. చిత్ర యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక గ్రాండ్ గా జరిగింది.