సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 22 జూన్ 2023 (11:53 IST)

తెలంగాణా దొరల ఆగడాలపై రుద్రంగి చిత్రం

Rudrangi new still
Rudrangi new still
జగపతి బాబు, ఆశిష్ గాంధీ, మమతా మోహన్ దాస్, విమల రామన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'రుద్రంగి'. ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను జూలై 7న విడుదల చేస్తున్నట్లు తాజాగా చిత్రబృందం ప్రకటించింది.
 
ఇప్పటికే అన్ని పాత్రల ఫస్ట్ లుక్ పోస్టర్స్. పాటలు, టీజర్ తో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిందీ సినిమా. ఒకప్పటి తెలంగాణ సామాజిక పరిస్థితులను నేపథ్యంగా ఎంచుకుని పీరియాడిక్ మూవీగా 'రుద్రంగి' రూపొందింది. నాటి తెలంగాణాలో దొరల ఆగడాలు ఎలా ఉన్నాయి అనేది కళ్ళకు కట్టినట్టు చూపించబోతున్నారు. భారీ నిర్మాణ విలువలు, ఆసక్తికర కథా కథనాలతో సినిమా ఆకట్టుకోబోతోంది.
 
జగపతి బాబు, ఆశిష్ గాంధీ, గానవి లక్ష్మణ్, విమలా రామన్, మమతా మోహన్ దాస్, కాలకేయ ప్రభాకర్, ఆర్ఎస్ నంద తదితరులు ఇతర  పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ - సంతోష్ శనమోని, ఎడిటింగ్ - బొంతల నాగేశ్వర్ రెడ్డి, సంగీతం - నాఫల్ రాజా ఏఐఎస్పి,  పీఆర్ వో: జి.ఎస్. కె మీడియా