మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 2 డిశెంబరు 2024 (17:16 IST)

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

AM Ratnam, jyoti krishna and ohters
AM Ratnam, jyoti krishna and ohters
పవర్ స్టార్ పవన్ కళ్యాన్ సినిమా హరిహరవీరమల్లు. ఈ చిత్రం సజావుగా జరగాలని విజయవాడలోని శ్రీకనకదుర్గ అమ్మవారిని చిత్ర టీమ్ నేడు దర్శించుకుంది. నిర్మాత ఎ.ఎం. రత్నం, దర్శకుడు జ్యోతిక్రిష్ణ తదితరులు దర్శించుకున్నారు. అనంతరం దర్శకుడు మాట్లాడుతూ, ఈ చిత్రం భారతీయ సినిమాలో కొత్త బెంచ్‌మార్క్‌లను నెలకొల్పడానికి సిద్ధమవుతుందని అన్నారు.
 
ప్రతిష్టాత్మకమైన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రస్తుతం విజయవాడలో చివరి దశ షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే మూడొంతుల షూటింగ్ పూర్తయింది. మిగిలిన షూటింగ్ పూర్తిచేసి అనుకున్నట్లుగా విడుదలచేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు పాత్ర అభిమానుల అంచనాలను మించి 28 మార్చి 2025న థియేటర్‌లలో మరపురాని సినిమా అనుభూతిని అందిస్తుంది.