శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (10:56 IST)

అన్నం తింటుండగా అలా చేశాడు.. కుర్చీ తీసి విసిరెయ్యబోయా?

టాలీవుడ్‌లో నటి హేమ అంటే తెలియని వారంటూ ఉండరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తెరపై ఈమె కామెడీ టైమింగ్‌లు అభిమానులు పొట్ట నొప్పి వచ్చేలా నవ్వాల్సిందే. దశాబ్దాల కాలం నుంచి హేమ టాలీవుడ్‌లో కీలకమైన నటిగా రాణిస్తోంది. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కెరీర్ కష్టాలను గుర్తు చేసుకుంటూ తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది.
 
ముత్యాల సుబ్బయ్య గారి భారత నారి అనే ఓ సినిమా చేస్తున్న సమయంలో తనకు జరిగిన ఘోర అవమానం గురించి చెప్పింది. షాట్ కంప్లీట్ అయ్యాక భోజనం టైం అవ్వడంతో ఆకలి వేసి తినడానికి కూర్చున్నానని తెలిపింది. 
 
ప్లేట్‌లో అన్నం పెట్టుకుని వచ్చి టేబుల్ మీద కూర్చుని అన్నం తింటుండగా.. వెంటనే ఓ ప్రొడక్షన్ బాయ్ వచ్చి.. ఇక్కడ కాదు.. పోయి అటు పక్కన కూర్చో అంటూ అవమానించాడు. నాకు మొదలే కోపం ఎక్కువ.. ఇక అలా అన్నం దగ్గర మాట్లాడేసరికి కోపం వచ్చి.. వెంటనే టేబుల్ ఎత్తి పడేసి కుర్చీ తీసి అతనిపై విసిరెయ్య బోయా. ఇంతలో పక్క వాళ్ళు వచ్చి ఆపారు".. అంటూ చెప్పుకొచ్చింది హేమ.