గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 డిశెంబరు 2021 (13:34 IST)

థియేటర్ల కలెక్షన్ల కంటే కిరాణా కొట్టు కలెక్షన్లే అధికం... : హీరో నాని

టాలీవుడ్ హీరో నాని సినిమా టిక్కెట్ల రేట్లను తగ్గిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. సినిమా టిక్కెట్ల వ్యవహారంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఏపీలో సినిమా థియేటర్ల కలెక్షన్లు, కిరాణా కొట్టు కలెక్షన్ల కంటే తక్కువగా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
 
హీరో నాని నటించిన తాజా చిత్రం "శ్యామ్ సింగరాయ్" శుక్రవారం విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం గురువారం మీడియా సమావేశం ఏర్పాటుచేసింది. ఇందులో నాని మాట్లాడుతూ, సినిమా టిక్కెట్లను ప్రభుత్వం తగ్గించిందన్నారు. ఇది సరైన నిర్ణయం కాదన్నారు. సినిమా టిక్కెట్లను ధరలు తగ్గించడంతో ఎగ్జిబిటర్లు ఆందోళన చెందుతున్నారు అని అన్నారు. 
 
సినిమా టిక్కెట్ల ధరలను తగ్గిచండం ద్వారా ప్రేక్షకులను ప్రభుత్వం అనుమతించిందన్నారు. సినిమా థియేటర్ల కంటే ఆ థియేటర్ పక్కనే ఉన్న కిరాణా కొట్టు కలెక్షన్స్ అధికంగా ఉంటాయన్నారు. టిక్కెట్ ధర ఎక్కువగా ఉన్నా కొని సినిమా చూసే సామర్థ్యం ప్రేక్షకులకు ఉందన్నారు. ఇపుడు తాను ఏది మాట్లాడినా వివాదాస్పదమే అవుతుందని అన్నారు.