శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి
Last Updated : మంగళవారం, 25 జూన్ 2019 (17:54 IST)

లైట్ తీసుకో పని చూస్కో... హీరో రామ్ స్పందన

గత కొన్నిరోజులుగా హీరో రామ్ సిగరెట్ వివాదం నెట్‌లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదంపై నోరు విప్పని రామ్ ట్విట్టర్ వేదికగా తన సమాధానాన్ని అందించారు. నిబంధనలకు విరుద్ధంగా బహిరంగ ప్రదేశంలో పొగ తాగారని, ఈ కారణంగా చార్మినార్ పోలీసులు ఆయనకు రూ.200 జరిమానా విధించారని ఒక వార్త బాగా వైరల్ అయ్యింది. 
 
ప్రస్తుతం ‘ఇస్మార్ట్ శంకర్’ షూటింగ్‌లో బిజీగా గడుపుతున్న రామ్ చార్మినార్ వద్ద జరుగుతున్న టైటిల్ సాంగ్ షూటింగ్‌లో భాగంగా సిగరెట్ కాల్చారు. గుల్జార్ హౌజ్ ప్రాంతంలో నిషేధిత ప్రదేశంలో హీరో సిగరెట్ కాల్చుతున్న ఫొటో సోషల్ మీడియాలో షేర్ కావడంలో, రంగంలోకి దిగిన చార్మినార్ పోలీసులు రామ్‌కు రూ.200 జరిమానా విధించారు.
 
ఈ విషయంపై స్పందించిన రామ్ అభిమానులకు కూడా ఉస్తాద్ ‘ఇస్మార్ట్ శంకర్’ స్టైల్‌లో ట్వీట్ చేసారు.
‘నా టైము.. పబ్లిక్ టైము వేస్ట్ చేయడం ఇష్టం లేక రెస్పాండ్ గాలే.. 
"షాట్‌లా కాల్చిన తమ్మి.. బ్రేక్ లా కాద్.. టైటిల్ సాంగ్‌లా చూస్తావ్‌గా స్టెపు.. ఫిర్ బి లాకి ఇజ్జత్ ఇచ్చి ఫైన్ కట్టినమ్.." 
గిప్పుడు నువ్వు కూడా నా లెక్క.. 
లైట్ తీసుకో పని చూస్కో 
ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ ’ అంటూ పేర్కొన్నారు.