శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (14:11 IST)

చెంప ఛెళ్లుమనేలా జవాబిచ్చిన జాహ్నవి

సోషల్ మీడియా అందరికీ అందుబాటులో ఉన్న ఈ కాలంలో తారలను, ప్రముఖులను విమర్శించే స్థాయి పెరిగింది. చీమ చిటుక్కుమన్నా వార్త సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతోంది. దానికితోడు వినియోగదారులు కామెంట్‌ల వర్షం కురిపిస్తున్నారు. సాధారణంగా నెటిజన్లు సినీ తారలందరిపైనా ట్రోలింగ్ చేస్తారు. అలాగే ఓ నెటిజన్ జాహ్నవీ కపూర్‍పై ట్రోలింగ్ చేశాడు. దానికి జాహ్నవి నోరు మూతపడేట్లుగా ధీటుగా సమాధానం ఇచ్చింది. 
 
ఫ్యాషన్‌లో న్యూట్రెండ్‌ను ఫాలోకావడంలో జాహ్నవి ముందుంటారని టాక్ ఉంది. ఇష్టం అనిపిస్తే అదే ఫ్యాషన్‌ని రిపీట్ చేస్తుంది. దీనిపై ఓ వ్యక్తి ట్రోలింగ్ చేసాడు. నీకు కొత్త బట్టలు లేవా? అవే బట్టలు మళ్లీ మళ్లీ వేసుకుంటున్నావని కామెంట్ చేశాడు. దీనికి ఆమె సరైన సమాధానమిచ్చింది. ప్రతి రోజూ కొత్త బట్టలు ధరించేంత డబ్బు ఇంకా సంపాదించలేదని జవాబిచ్చింది. దాంతో అందరికీ నోరు మూతపడినట్లయింది. 
 
సోషల్ మీడియా బలంగా ఉన్న ఈ రోజుల్లో అందరికీ తగినట్లుగా ఉండి సంతృప్తిపరచడం సాధ్యపడదు. ప్రతి విషయాన్నీ సీరియస్‌గా పట్టించుకోనవసరం లేదు. జిమ్‌కి వెళ్లేటప్పుడు ఏమి వేసుకోవాలనేది నా వృత్తి సంబంధించిందా? అని ప్రశ్నించింది. 'ధడక్' చిత్రం తర్వాత జాహ్నవి ప్రస్తుతం పైలట్ గంజన్ సక్సేనా జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న "కార్గిల్ గర్ల్" అనే చిత్రంలో నటిస్తున్నది. 1999 కార్గిల్ వార్ నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కుతున్నది. అలాగే కరణ్ జోహర్ రూపొందించే 'తఖ్త్' చిత్రంలోనూ, రాజ్ కుమార్ రావుతో "రుహ్ ఆఫ్జా" చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికై బిజీగా గడుపుతోంది.