శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసు
Last Updated : గురువారం, 14 మార్చి 2019 (11:17 IST)

‘మహానటి’కి ఫిదా అయిపోయానంటున్న అతిలోక సుందరి కుమార్తె

తెలుగు తమిళ సినీ పరిశ్రమలలో తిరుగులేని బావుటా ఎగరవేసిన కీర్తి సురేష్ తన తొలి బాలీవుడ్‌ చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కీర్తి సురేష్‌కు తాను ఫిదా అయిపోయానంటున్నారు అలనాటి అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్. జాన్వి తండ్రి, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌ నిర్మించనున్న ఓ బయోపిక్‌లో కీర్తి.. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌కు జోడీగా నటించనున్న విషయాన్ని చిత్రబృందం బుధవారం ప్రకటించింది. 
 
ఈ సందర్భంగా తనకు కీర్తి సురేష్ అంటే చాలా ఇష్టమని వెల్లడించిన జాన్వి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా కీర్తి ఫొటోను పోస్ట్‌ చేసారు. ‘‘కీర్తీ.. ‘మహానటి’ సినిమాలో మిమ్మల్ని చూసినప్పటి నుండి మీకు ఫిదా అయిపోయాను. మా నాన్న నిర్మిస్తున్న చిత్రంలో మీరు నటిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగానూ, ఆత్రుతగానూ ఉంది. బాలీవుడ్‌కు స్వాగతం’’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. అమిత్‌ శర్మ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం ఫుట్‌బాల్‌ క్రీడ నేపథ్యంలో ఉండబోతోందని బాలీవుడ్‌ వర్గాల సమాచారం.