గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి
Last Updated : శుక్రవారం, 27 డిశెంబరు 2019 (13:37 IST)

షూటింగ్‌లో గాయపడ్డ యువహీరో... వీడియో వైరల్

చాలామంది నటీనటులు ఏ సీన్ అయినా సరే డెడికేషన్‌తో వర్క్ చేస్తూ కొన్నిసార్లు గాయాలను సైతం లెక్కచేయకుండా విజయం కోసం పని చేస్తుంటారు ఎందరో నటీనటులు. ఇటీవల ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది.

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘రెడ్‌ (RED)’. కిషోర్‌ తిరుమల డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాకు స్రవంతి రవికిషోర్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 
 
నివేదా పేతురాజ్‌ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం చాలా వేగంగా జరుగుతోంది. షూటింగ్‌లో భాగంగా ప్రముఖ ఫైట్ మాస్టర్‌ పీటర్‌ హెయిన్స్‌ రామ్‌పై యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా హీరో రామ్‌కు స్వల్పంగా గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు రామ్‌ ట్విటర్‌‌లో గాయాలను చూపుతూ స్పెషల్‌ వీడియోను పోస్ట్‌ చేశారు.
 
‘హాయ్‌ మాస్టర్‌. మీకు నాపై ఉన్న ప్రేమను ఫీల్‌ అవుతున్నాను కానీ చూపించలేకపోతున్నాను. అలాగే మీరు నాకిచ్చిన ఈ నొప్పిని కూడా. లవ్‌, రాపో, #రెడ్‌దిఫిల్మ్ #రెడ్‌ ఫైట్‌ ’ అని రామ్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.