మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: గురువారం, 26 డిశెంబరు 2019 (19:52 IST)

తమన్నా థర్టీ ఇయర్స్ ఇక్కడ..

మిల్కీబ్యూటీ తమన్నా భాటియా దక్షిణ భారతదేశంలో పాటు బాలీవుడ్ లోను ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. తమన్నా వయస్సు పెరుగుతున్న కొద్దీ ఆమెకు ఆఫర్లు కూడా అలాగే పెరుగుతున్నాయంటున్నారు సినీవిశ్లేషకులు. ఆమె అభిమానుల సంఖ్య సైతం ఏమాత్రం తగ్గ లేదు. హ్యాపీ డేస్ ద్వారా టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న తమన్నా ఆ తరువాత వెనుతిరిగి చూడనేలేదు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్లో అందరూ టాప్ హీరోలతో నటించే ఛాన్స్ కొట్టేసింది తమన్నా.
 
అలా చూస్తుండగానే తను ఇండస్ట్రీలో 15 యేళ్ళు పూర్తి చేసుకుంది. అది కూడా 50కి పైగా సినిమాలలో నటించి ఔరా అనిపిస్తోంది. తమన్నా తొలి సినిమా నుంచి చాలా అందంగా, సెక్సీ లుక్స్‌తో కుర్రాళ్ళ మతి పోగొట్టే రీతిలో తన గ్లామర్ పెంచుకుంటూ పోతోంది. అందుకే ఆమెకు సినిమా అవకాశాలు ఎక్కువగానే వస్తున్నాయి. అంతకుమించి విజయాలు కూడా అదే స్థాయిలో వున్నాయి. 
 
అయితే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్నదే తమన్నా ఆలోచన. అందుకే ఎన్ని సినిమాలు చేసినా.. ఎన్ని విజయాలు వరించినా తానెప్పుడు నిత్య విద్యార్థినే అని చెబుతోంది. ఈ నెల 21వ తేదీ 30 సంవత్సరంలోకి అడుగుపెట్టింది తమన్నా. అయితే ఎవరైనా స్నేహితులు నీకు వయస్సు అయిపోతుందని ఆటపట్టిస్తుంటే మాత్రం అస్సలు ఊరుకోదట. నాకేం వయస్సు కాలేదుటే అంటూ రుసరుసలాడుతుందట మిల్కీ బ్యూటీ.